టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ వివాదాలకు దూరంగా ఉంటారు. వివాదాస్పద అంశాల గురించి స్పందించడానికి కూడా ఈ స్టార్ హీరో ఇష్టపడరు. ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్న ప్రభాస్ సలార్ సినిమా ప్రమోషన్స్ కోసం త్వరలో మీడియా ముందుకు రానున్నారు. ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలు విడుదలయ్యేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటానని అభిమానులకు మాట ఇచ్చిన ప్రభాస్ ఈ ఏడాది ఇప్పటికే ఆదిపురుష్ ను విడుదల చేయగా డిసెంబర్ 22వ తేదీన సలార్ ను రిలీజ్ చేస్తున్నారు.
క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానుండటం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో అటు ఓవర్సీస్ లో సలార్ ప్రభంజనం మామూలుగా ఉండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే సినిమాల బడ్జెట్ విషయంలో ప్రభాస్ కు బన్నీ, తారక్, చరణ్ నుంచి పోటీ ఎదురవుతోంది. ప్రభాస్ సినిమాల బడ్జెట్ కు సమానంగా ఈ హీరోల సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం.
ప్రభాస్ (Prabhas) సినిమాలు 300 నుంచి 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. ప్రాజెక్ట్ కే బడ్జెట్ మరింత ఎక్కువ మొత్తమని తెలుస్తోంది. మిగతా హీరోల విషయానికి వస్తే ఎన్టీఆర్ ప్రతి సినిమా 300 నుంచి 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతుండగా బన్నీ, చరణ్ సినిమాలు కూడా ఇదే స్థాయి బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీ బడ్జెట్ 300 కోట్ల రూపాయలుగా ఫిక్స్ అయిందని తెలుస్తోంది.
త్రివిక్రమ్ తన శైలికి భిన్నమైన కథతో బన్నీతో సినిమాను తెరకెక్కించనున్నారని ఈ సినిమా పాన్ ఇండియా రికార్డులను షేక్ చేసే సినిమా కానుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. త్రివిక్రమ్ ఈ సినిమాతో జక్కన్న, సుకుమార్ లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మహేష్, పవన్ కళ్యాణ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు 300 కోట్ల రూపాయల కంటే ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కనున్నాయని తెలుస్తోంది.