హీరోలకు తగ్గ కార్లు

బాలీవుడ్ హీరోలు సినిమాల్లోనే కాదు.. బయట కూడా కోట్ల రూపాయల విలువైన కార్లలో తిరుగుతారు. వారికి కార్లు అవసరం మాత్రమే కాదు, స్టేటస్ సింబల్ కూడ. అందుకే లేటెస్ట్ కార్లను వారి గ్యారేజ్ లోకి తీసుకొచ్చి పెడుతున్నారు.

అమితాబ్ బచ్చన్సినిమాల్లోనే కాదు.. కార్లలోనూ అమితాబ్ బచ్చన్ యువ హీరోలతో పోటీ పడుతుంటారు. బిగ్ బీ కాంపౌండ్ లోని కార్లు ఇవే.. రోల్స్ రాయిస్ ఫాంటమ్ (రూ.4 కోట్లు), బెంట్లీ కాంటినెంటాల్ జీటీ (రూ.4 కోట్లు), రేంజ్ రోవర్ ఎస్ యూ వీ (రూ.2.75 కోట్లు), లెక్సెస్ ఎల్ ఎక్స్ 470 (రూ.1 కోటి), మెర్సిడెస్ బెంజ్ (రూ.1.2కోట్లు), పొర్శె కేమెన్ ఎస్ (రూ.1.3 కోట్లు), టయోటా ల్యాండ్ క్రూజర్ (రూ.1.2 కోట్లు).

సల్మాన్ ఖాన్పిడికిలి బిగించి పంచ్ కొడితే చాలు అభిమానులకు కిక్కే కిక్కు. మరి సల్మాన్ ఖాన్ కి కిక్కిచ్చేదేంటో తెలుసా? స్పోర్ట్స్ కార్లో వాయు వేగంతో దూసుకెళ్ళడం. ఆడి ఆర్ ఎస్ 7 స్పోర్ట్స్ మోడల్ కార్ లాంచింగ్ సల్మాన్ చేతుల మీదుగానే జరిగింది. మన దేశంలో ఆ కారు నడిపిన తొలి వ్యక్తిగా సల్మాన్ నిలిచారు. ఈ కండల వీరుడు మెచ్చి సొంతం చేసుకున్న కార్లు ఇవే.
ఆడి ఆర్ 8 (రూ.2.30 కోట్లు ), మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ (రూ.1.40 కోట్లు ), ఆడి ఆర్ ఎస్7 (రూ.1.40 కోట్లు ), టయోట ల్యాండ్ క్రూజర్ (రూ.1.20 కోట్లు ), బీఎండబ్ల్యూ ఎక్స్ 6 (రూ.1 కోట్లు ).

షారూక్ ఖాన్బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్. సొంత కాళ్ల మీద స్టార్ గా ఎదిగిన హీరో. తన రేంజ్ కి తగ్గట్టే కార్లను మెయిన్ టైన్ చేస్తున్నారు. ఇంటి నుంచి అడుగు పెట్టగానే ఏ కారు ఎక్కాలో ఆలోచించుకోవడానికి షారూక్ కు కాస్త టైం పడుతుందంట. ఆయన గ్యారేజ్ లో అన్ని కార్లు ఉన్నాయి మరీ. వాటిలో విలువైన కొన్ని కార్ల వివరాలు. బెంట్లీ కాంటినెంటాల్ జీటీ (రూ.4 కోట్లు), రోల్స్ రాయిస్ ఫాంటమ్ డ్రాప్ హెడ్ (రూ.4 కోట్లు), బీఎండబ్ల్యూ 7 (రూ.2 కోట్లు ), బీఎండబ్ల్యూ 6 (రూ.1.5 కోట్లు ), టయోట ల్యాండ్ క్రూజర్ (రూ.1.20 కోట్లు ).

సంజయ్ దత్మున్నాభాయ్ సంజయ్ దత్ ఇంటికి వచ్చిన వారెవరైనా ఆయన గ్యారేజ్ పై ఓ లుక్ వేస్తారంట. ఆ గ్యారేజ్ లో ఖరీదైన కార్లు ఉన్నాయి. ఆ జాబితాలో ఉన్న కొన్ని.. రోల్స్ రాయిస్ ఫాంటమ్, ఆడి ఏ8, ఆర్ 8, రేంజ్ రోవర్, బెంట్లీ కాంటినెంటల్, ఫెర్రారి 599 జీటీబీ.

ప్రియాంక చోప్రా..బాలీవుడ్ నంబర్ వన్ హీరోయిన్ ప్రియాంక చోప్రా. అబ్బాయిలకు అమ్మాయిలు ఎందులోనూ తక్కువ కాదని
చెబుతుంటుంది. చెప్పడమే కాదు హీరోలకు పోటీగా కార్లను సొంతం చేసుకుంది. ఆమె కార్లు.. రోల్స్ రాయిస్ (రూ.3.7 కోట్లు), బీఎండబ్ల్యూ 7 (రూ.2 కోట్లు), పోర్శే కయెన్నె (రూ.1.5 కోట్లు ), మెర్సిడెస్ ఈక్లాస్ (రూ.1.3 కోట్లు).

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus