Upasana: నేను అలాంటి వాతావరణంలో పెరిగాను.. ఉపాసన కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన (Ram Charan) రామ్ చరణ్ కు ప్రేక్షకుల్లో ఊహించని రేంజ్ లో క్రేజ్ ఉండగా చరణ్ పారితోషికం భారీ రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే. చరణ్ భార్య ఉపాసనను సైతం మెగా ఫ్యాన్స్ ఎంతగానో అభిమానిస్తారు. తాజాగా ఒక సందర్భంలో పెళ్లి గురించి ఉపాసన చేసిన కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. మాది, చరణ్ వాళ్లది పూర్తిగా భిన్నమైన కుటుంబ నేపథ్యాలు అని ఆమె తెలిపారు.

నాకు పెళ్లి కాగానే వేరే ప్రపంచానికి వచ్చినట్లు అనిపించిందని ఉపాసన పేర్కొన్నారు. ఇప్పుడు రామ్ చరణ్ కు నీడలా ఉంటున్నందుకు ఎంతో గర్వంగా ఉందని ఉపాసన వెల్లడించారు. మేము పరస్పరం సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని ఆమె తెలిపారు. బిడ్డను కనాలని నిర్ణయించుకున్న సమయంలోనే క్లీంకారకు మేము జన్మనిచ్చామని ఉపాసన పేర్కొన్నారు. మా అమ్మ వాళ్లను తాతయ్య ఆత్మవిశ్వాసంతో పెంచారని ఆమె చెప్పుకొచ్చారు.

మా అమ్మ వాళ్లు కూడా ఆయన కలలకు అనుగుణంగా జీవించారని ఉపాసన వెల్లడించారు. మా ఫ్యామిలీలోని మహిళలు నా లైఫ్ లో కీలక పాత్ర పోషించారని నేను స్త్రీ ప్రపంచం అని భావించే వాతావరణంలో పుట్టానని ఆమె అన్నారు. ఉపాసన చెప్పిన విషయాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు రామ్ చరణ్ సైతం ఉపాసనపై ప్రశంసల వర్షం కురిపించారు.

కేవలం నా భార్య కావడం వల్లే ఉపాసనకు (Upasana) ఈ స్థాయిలో గుర్తింపు రాలేదని ఆమె చేసిన మంచి పనులే ఆమెకు వచ్చిన ఈ గుర్తింపుకు కారణమని పేర్కొన్నారు. ఉపాసన కుటుంబ విలువలను గౌరవిస్తుందని వేర్వేరు రంగాలలో తనదైన ముద్ర వేసిందని రామ్ చరణ్ వెల్లడించారు. ఉపాసన వారసత్వాన్ని అందంగా ముందుకు తీసుకెళ్తుందని చరణ్ చెప్పుకొచ్చారు. రామ్ చరణ్ చేసిన ఈ కామెంట్స్ ఫ్యాన్స్ కు మరింత సంతోషాన్ని కలిగిస్తున్నాయి.

ఇంటర్వ్యూ : ‘గామి’గురించి డైరెక్టర్ విద్యాధర్ కాగిత చెప్పిన ఆసక్తికర విషయాలు.!

ఇంటర్వ్యూ : ‘భీమా’ గురించి గోపీచంద్ చెప్పిన ఆసక్తికర విషయాలు
రోడ్డుపై యాంకర్ ఝాన్సీ చెత్త సేకరించడానికి కారణాలివేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus