బాలకృష్ణ (Nandamuri Balakrishna) , బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్‌లో రూపొందుతున్న అఖండ 2పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరి కలయికలో ఇంతకుముందు వచ్చిన “సింహా” (Simha) , లెజెండ్ (Legend) ‘అఖండ’ (Akhanda) వంటి భారీ విజయాలు బాలయ్య క్రేజ్ ను ఒక్కసారిగా డబుల్ చేశాయి. ఇక దానికి మించి అఖండ 2 రానున్నట్లు తెలుస్తోంది. సనాతన ధర్మం, ఆధ్యాత్మికతకు పెద్దపీట వేస్తూ గూస్‌బంప్స్ వచ్చేలా ప్లాన్ చేశారని సమాచారం. ఈ సారి బోయపాటి శ్రీను ప్రత్యేకంగా మహా కుంభమేళ నేపథ్యంలో కొన్ని కీలక సన్నివేశాలను రూపొందిస్తున్నాడు.
Akhanda 2
యూపీలో ఇటీవల జరిగిన కుంభమేళలో చిత్రీకరణ జరిపిన బోయపాటి, అక్కడి ఆధ్యాత్మిక వాతావరణాన్ని అఖండ 2లో ప్రతిబింబించేలా తీర్చిదిద్దినట్లు టాక్. ఇక, సినిమాలో కీలకమైన అఘోరి పాత్ర కోసం ప్రముఖ నటి శోభనను (Shobana) ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. శోభన ఈ పాత్రకు సంబంధించిన స్క్రిప్ట్ వినగానే కన్‌విన్స్ అయి ఒప్పుకుందట. ఈమె నటన ప్రేక్షకులకు విభిన్న అనుభూతి కలిగిస్తుందని చిత్రబృందం చెబుతోంది.
నెవ్వర్ బిఫోర్ ఆన్సలా అఘోరీ పాత్రతో ట్విస్ట్ ఉండబోతోందట. దీంతో ఈ లీక్ ప్రేక్షకులలో ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. ఈ పాత్ర కథలో కీలకమైన ట్విస్ట్ ఇవ్వబోతుందట. అఖండ 2కు ప్రస్తుతం ఉన్న అంచనాలు మరింత పెంచడంలో శోభన పాత్ర కీలకమవుతుందని టాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. బాలకృష్ణ పవర్ఫుల్ పాత్రలో నటిస్తుండగా, బోయపాటి సిద్ధం చేసిన యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలవబోతున్నాయి.
పైగా సనాతన ధర్మం వంటి అంశాలను కూడా చిత్రంలో బలంగా ప్రదర్శిస్తుండటం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. మొత్తం మీద, ఈ చిత్రం దసరా కానుకగా సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.