బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన అలియా భట్, బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ కలిసి నటించిన బ్రహ్మాస్త్ర సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. బాయ్ కాట్ ట్రెండింగ్ వల్ల వార్తల్లో నిలిచిన ఈ సినిమాకు పాజిటివ్ గా కంటే నెగిటివ్ గా ఎక్కువగా ప్రచారం జరుగుతుండటం గమనార్హం. బాయ్ కాట్ ట్రెండింగ్ వల్ల రణ్ బీర్, అలియాలకు పలు ప్రాంతాలలో అవమానాలు సైతం ఎదురయ్యాయి.
గతంలో పలు సినిమాల విషయంలో బాయ్ కాట్ అంటూ ట్రెండింగ్ చేసి ఆ సినిమాలు ఫ్లాప్ కావడానికి కారణమైన నెటిజన్లు ఈ సినిమా విషయంలో కూడా అదే విధంగా వ్యవహరించడం గమనార్హం. బాయ్ కాట్ ట్రెండింగ్ గురించి అలియా భట్ స్పందిస్తూ బ్రహ్మాస్త్ర సినిమా గురించి ఎలాంటి నెగిటివిటీ లేదని ఆమె చెప్పుకొచ్చారు. తాను బాయ్ కాట్ గురించి అస్సలు ఆలోచించడం లేదని సినిమా గురించి అంతటా పాజిటివిటీ ఉందని అలియా భట్ కామెంట్లు చేయడం గమనార్హం.
అలియా భట్ బాయ్ కాట్ ట్రెండింగ్ గురించి నెగిటివ్ గా కామెంట్లు చేసి ఉంటే ఆ ప్రభావం ఈ సినిమాపై కచ్చితంగా పడి ఉండేది. ఆ తప్పు జరగకుండా అలియా భట్ జాగ్రత్త పడ్డారు. మరోవైపు బాయ్ కాట్ ట్రెండింగ్ గురించి రణ్ బీర్ స్పందిస్తూ ప్రేక్షకులు ప్రేమిస్తే సినిమా మంచి కలెక్షన్లను సాధించడం సాధ్యమేనని కామెంట్లు చేశారు. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు సినిమాలను ఆదరిస్తారని ఆయన అన్నారు.
మంచి సినిమాలను థియేటర్లలో చూడకూడదని ప్రేక్షకులు అనుకోరని ఆయన చెప్పుకొచ్చారు. మరికొన్ని గంటల్లో ఈ సినిమా ఫలితం తేలిపోనుంది. ఉమైర్ సంధు ఈ సినిమాకు నెగిటివ్ గా రివ్యూ ఇవ్వడంతో ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందనే చర్చ జరుగుతోంది. 400 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.