జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప (Pushpa 2) మూవీ గురించి పరోక్షంగా చేసిన కామెంట్లు ప్రస్తుతం సంచలనం అవుతున్నాయి. పవన్ మాట్లాడుతూ కల్చర్ ఎలా మారిందో నా కొలీగ్స్ తో ఈ మధ్య షేర్ చేసుకున్నానని అన్నారు. 40 సంవత్సరాల క్రితం సినిమాలలో హీరో అడవిని కాపాడేవాడని ప్రస్తుతం హీరోయిజం అంటే హీరో అడవిలో చెట్లు నరికి స్మగ్లింగ్ చేస్తాడని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఇదే హీరోయిజం అయిపోయిందని పవన్ వెల్లడించారు.
Pawan Kalyan
నేను కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తినే అయినప్పటికీ ఇలాంటి సినిమాలు చేయడాన్ని నేను ద్వేషిస్తానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నేను సరైన మెసేజ్ ఇస్తున్నానా లేదా అనే స్ట్రగుల్ నాలో ఎప్పుడూ ఉంటుందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. నా సంగతి పక్కన పెడితే సినిమాలలో కల్చరల్ షిప్టింగ్ ఎలా జరుగుతోందనేది ఆసక్తికరం అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు పుష్ప మూవీని ఉద్దేశించి చేసినవే అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పుష్ప ది రూల్ సినిమాకు టికెట్ రేట్ల పెంపు ఉంటుందా అనే ప్రశ్నలు సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పవన్ కామెంట్లు నిజంగా పుష్ప2 మూవీని ఉద్దేశించినవే అయితే ఈ సినిమాకు ఇబ్బందులు తప్పవని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
మరోవైపు అల్లుఅర్జున్ మాత్రం సైలెంట్ గా ఉన్నారు. ఎన్నికల ప్రచారం తర్వాత పలు వివాదాలలో చిక్కుకున్న బన్నీ ఆ వివాదాల గురించి నోరు మెదపడానికి ఇష్టపడలేదు. బన్నీ రాబోయే రోజుల్లో ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది. అల్లు అర్జున్ భవిష్యత్తు సినిమాలు త్రివిక్రమ్ (Trivikram) , బోయపాటి శ్రీను (Boyapati Srinu) డైరెక్షన్ లో తెరకెక్కనున్నాయని సమాచారం అందుతోంది. పవన్ కామెంట్లు మాత్రం సోషల్ మీడియాలో ఒకింత సంచలనం అవుతుండటం గమనార్హం. బన్నీ ఫ్యాన్స్ ఈ కామెంట్స్ విషయంలో ఒకింత కంగారు పడుతున్నారు.