Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Featured Stories » ‘బుట్ట బొమ్మ’ కలర్ ఫుల్ గా ఉంటుంది : అనిక సురేంద్రన్

‘బుట్ట బొమ్మ’ కలర్ ఫుల్ గా ఉంటుంది : అనిక సురేంద్రన్

  • January 19, 2023 / 06:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘బుట్ట బొమ్మ’ కలర్ ఫుల్ గా ఉంటుంది : అనిక సురేంద్రన్

ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి ‘బుట్ట బొమ్మ’ అనే మరో ఆసక్తికరమైన చిత్రం రాబోతోంది. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సితార నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రూరల్ డ్రామా ఫిల్మ్ కి సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. అనిక సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంతో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరచయమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా జనవరి 26న భారీస్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలలో భాగంగా నటి అనిక సురేంద్రన్ విలేకర్ల సమావేశంలో పాల్గొని ఈ చిత్రానికి సంబంధించిన పలు విశేషాలను పంచుకున్నారు.

బుట్టబొమ్మ లో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చినప్పుడు ఏమనిపించింది?
ఎన్నో ఏళ్లుగా బాల నటిగా సినిమాల్లో నటిస్తూ వచ్చాను. ఇప్పుడిలా హీరోయిన్ గా నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. కప్పేల మలయాళ వెర్షన్ చూశాను.. చాలా నచ్చింది. ఇంతలోనే ఆ ఫిల్మ్ రీమేక్ లో హీరోయిన్ గా నటించే అవకాశం రావడం ఆనందం కలిగించింది. ఆ పాత్రలో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి, నటనకు ఆస్కారం ఉంది.

బుట్టబొమ్మ సినిమా ఒప్పుకోవడానికి ప్రధాన కారణం?
అప్పటికే ఈ సినిమా మాతృక చూసి ఉన్నాను. నాకు ఎంతో నచ్చిన ఆ సినిమా రీమేక్ లో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది. పైగా సితార వంటి ప్రముఖ నిర్మాణ సంస్థ రూపొందిస్తోంది. అందుకే ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే అంగీకరించాను.

సినిమాలో ఏమైనా మార్పులు చేశారా?
మూల కథ అలాగే ఉంటుంది. కానీ తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేశారు. ఒరిజినల్ ఫిల్మ్ కంటే కూడా ఇది ఇంకా కలర్ ఫుల్ గా ఆకట్టుకునేలా ఉంటుంది.

మొదటిసారి హీరోయిన్ గా నటించడం వల్ల ఏమైనా ఒత్తిడికి లోనయ్యారా?
హీరోయిన్ గా నటించడం ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది. పైగా నాది సినిమాలో ప్రధాన పాత్ర. అయితే దర్శకుడు రమేష్ గారు, మిగతా చిత్ర యూనిట్ మద్దుతుతో ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా సినిమాని పూర్తి చేయగలిగాను.

మీకు తెలుగు రాదు కదా.. షూటింగ్ లో ఏమైనా ఇబ్బంది పడ్డారా?
తెలుగులో నాకు సంభాషణలకు అర్థం తెలీదు. కానీ సన్నివేశాలను అర్థం చేసుకొని నటించాను. దర్శకుడు రమేష్ గారు ఆ సన్నివేశాల తాలూకు ఎమోషన్స్ ని వివరించి నటన రాబట్టుకున్నారు.

అర్జున్ దాస్ వాయిస్ విని భయపడిన సందర్భాలు ఉన్నాయా?
అవును ఆయన వాయిస్ లో చాలా బేస్ ఉంటుంది. ఆయన వాయిస్ విని చాలా సీరియస్ గా ఉంటారేమో అనుకున్నాను. కానీ ఆయన చాలా స్వీట్ పర్సన్.

రీమేక్ చేసినప్పుడు సహజంగానే మాతృకతో పోలుస్తుంటారు కదా.. నటించేటప్పుడు దాని గురించి ఏమైనా ఆలోచించారా?
ముందే చెప్పినట్లుగా ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమాలో కొన్ని మార్పులు చేశారు. అలాగే నేను కూడా ఒరిజినల్ ఫిల్మ్ లోని నటిని కాపీ కొట్టే ప్రయత్నం చేయలేదు. పాత్రను అర్థం చేసుకొని ఆ సన్నివేశాలకు తగ్గట్లుగా నటించాను.

సినిమా చూశారా?
ఇంకా చూడలేదు. కొన్ని కొన్ని సన్నివేశాలు చూశాను.. నచ్చాయి. మీతోపాటు సినిమా చూడటానికి ఎంతో ఆస్తికరంగా ఎదురు చూస్తున్నాను.

ఈ సినిమా ద్వారా ఏమైనా నేర్చుకున్నారా?
ఎంతో నేర్చుకున్నాను. దర్శకత్వ విభాగంలో అనుభవమున్న రమేష్ గారు నటన పరంగా ఎన్నో మెలుకువలు నేర్పించారు.

నిర్మాణ సంస్థ గురించి చెప్పండి?
నేను ఇప్పటిదాకా పని చేసిన ఉత్తమ నిర్మాణ సంస్థల్లో సితార ఒకటి. వంశీ గారు నన్ను ఈ చిత్రం కోసం ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు. సితార లాంటి పెద్ద సంస్థలో హీరోయిన్ గా మొదటి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది.

తెలుగులో వరుసగా సినిమాలు చేస్తారా?
మొదటి సినిమానే సితారలో చేయడం ఎంతో ఆనందంగా ఉంది. సినిమా విడుదలకు ముందే తెలుగులో ఇంకా అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను.

మీ తదుపరి చిత్రాల గురుంచి చెప్పండి?
మలయాళంలో ‘ఓ మై డార్లింగ్’ అనే మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నాను. తమిళ్ లో ఒక మూవీ చేస్తున్నాను. అలాగే కొన్ని తెలుగు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anikha surendran
  • #Butta Bomma

Also Read

Mirai: ‘మిరాయ్’ లో రాముడు పాత్ర చేసిన నటుడు ఎవరో తెలుసా?

Mirai: ‘మిరాయ్’ లో రాముడు పాత్ర చేసిన నటుడు ఎవరో తెలుసా?

Kishkindhapuri Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’

Kishkindhapuri Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’

Mirai Collections: 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

Mirai Collections: 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

Jagapathi Babu: నేను సాంబార్‌ లాంటి వాడిని.. జగపతి బాబు కామెంట్స్‌ వైరల్‌!

Jagapathi Babu: నేను సాంబార్‌ లాంటి వాడిని.. జగపతి బాబు కామెంట్స్‌ వైరల్‌!

2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

related news

అసలు సిసలు సెకండ్ హీరోలు

అసలు సిసలు సెకండ్ హీరోలు

Mirai: ‘మిరాయ్’ లో రాముడు పాత్ర చేసిన నటుడు ఎవరో తెలుసా?

Mirai: ‘మిరాయ్’ లో రాముడు పాత్ర చేసిన నటుడు ఎవరో తెలుసా?

Kishkindhapuri Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’

Kishkindhapuri Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’

Mirai Collections: 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

Mirai Collections: 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

Jagapathi Babu: నేను సాంబార్‌ లాంటి వాడిని.. జగపతి బాబు కామెంట్స్‌ వైరల్‌!

Jagapathi Babu: నేను సాంబార్‌ లాంటి వాడిని.. జగపతి బాబు కామెంట్స్‌ వైరల్‌!

trending news

Mirai: ‘మిరాయ్’ లో రాముడు పాత్ర చేసిన నటుడు ఎవరో తెలుసా?

Mirai: ‘మిరాయ్’ లో రాముడు పాత్ర చేసిన నటుడు ఎవరో తెలుసా?

3 hours ago
Kishkindhapuri Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’

Kishkindhapuri Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’

15 hours ago
Mirai Collections: 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

Mirai Collections: 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

16 hours ago
Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

16 hours ago
Jagapathi Babu: నేను సాంబార్‌ లాంటి వాడిని.. జగపతి బాబు కామెంట్స్‌ వైరల్‌!

Jagapathi Babu: నేను సాంబార్‌ లాంటి వాడిని.. జగపతి బాబు కామెంట్స్‌ వైరల్‌!

1 day ago

latest news

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

2 days ago
Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

2 days ago
Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

2 days ago
Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 days ago
Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version