బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో రెండోవారం కెప్టెన్ గా అనిల్ రాథోడ్ నిలిచాడు. అసలు అనిల్ రాథోడ్ మద్యలో టాస్క్ ఓడిపోయాడు. కానీ, కెప్టెన్ గా అయ్యాడు. నిజానికి కెప్టెన్సీ టాస్క్ లో ఆరుగుర పార్టిసిపేట్ చేశారు. ఇందులో సీనియర్స్ నుంచీ అరియానా, హమీదా, జూనియర్స్ నుంచీ చైతూ, శివ, అనిల్ ఇంకా శ్రీరాపకలు టాస్క్ ఆడారు. ఇక్కడే గార్డెన్ ఏరియాలో టైల్స్ పై నడుస్తూ కింద ఉన్న లావాలో అంటే నేలపై కాలు పెట్టుకుండా కంటైనర్ లో లిక్విడ్ నింపాలి.
ఎవరి కంటైనర్ లో లిక్విడ్ ఎక్కువగా ఉంటుందో వాళ్లని లాస్ట్ రౌండ్ లో పరిగణించాలని చెప్పాడు బిగ్ బాస్. అయితే, ఫస్ట్ నుంచీ కాలు కిందపెడితే అవుట్ అంటూ సంచాలక్ గా ఉన్న తేజస్వి చెప్పింది. దీంతో ఫస్ట రౌండ్ లోనే శ్రీరాపక అవుట్ అయ్యింది. ఆ తర్వాత హమీదా, అరియానా, గేమ్ నుంచీ అవుట్ అయ్యారు. చైతన్య కూడా కాలు కిందపెట్టే సరికి గేమ్ నుంచీ తప్పుకోమని సంచాలక్ అయిన తేజస్వి చెప్పింది. ఇక మిగిలింది ఇద్దరూ వీరిద్దరూ గేమ్ ని చాలాసేపు ఆడారు.
అయితే, మద్యలో మహేష్ విట్టా అనిల్ ని కాలు కిందపెట్టేశావ్ అంటూ అబ్జక్ట్ చేశాడు. ఇక్కడే అనిల్ నేను బ్యాలన్స్ చేస్తున్నా, స్లిప్ అయితే ఇదిగో ఇలా ఉంటుంది అంటూ చూపిస్తూ కాలు కిందపెట్టాడు. అప్పుడు గేమ్ పాజ్ లోనే ఉంది. అయినా అనిల్ కాలు కిందపెట్టాడు కాబట్టి నిజానికి టాస్క్ ఓడిపోయినట్లే లెక్క అంటూ ఆర్గ్యూమెంట్ మొదలు అయ్యింది. సంచాలక్ గా మాత్రం తేజు మరోఛాన్స్ ఇస్తున్నా అంటూ అనిల్ ని గేమ్ కంటిన్యూ చేయించింది.
లాస్ట్ వరకూ ఉన్న అనిల్ మళ్లీ టైల్స్ కి నేలకి దగ్గరగా నడుస్తుంటే ఈసారి కాలు లైట్ గా కిందపెట్టడం చూసిన తేజస్వి అనిల్ ని అవుట్ అని చెప్పింది. దీంతో యాంకర్ శివ ఇంటి కెప్టెన్ అనుకున్నారు. కానీ, అఖిల్ కంటైనర్ లో లిక్విడ్ ని చూడాలని లాస్ట్ లో ఉన్న ఇద్దరిలో దాన్ని బట్టే నిర్ణయం తీస్కోవాలి అంటూ మాట్లాడాడు. సంచాలక్ అయిన తేజస్వి కంటైనర్ లో లిక్విడ్ ని చూసింది.
అందులో అనిల్ పేరు మీద ఉన్నదాంట్లో శివ కంటే ఎక్కువగా ఉంది కాబట్టి అనిల్ రాథోడ్ ని కెప్టెన్ గా ప్రకటించింది. టాస్క్ లో తడబడినా కూడా అనిల్ రాథోడ్ కెప్టెన్ గా అయ్యాడన్నమాట. మరి ఈసారి ఎలిమినేషన్ తప్పించుకుంటే నామినేషన్స్ నుంచీ కూడా తప్పించుకుని మరోవారం హౌస్ లో ఉంటాడు ఈ కుర్రాడు. అదీ మేటర్.