కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన కమల్ హాసన్ గతేడాది విడుదలైన విక్రమ్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా కథ, కథనం కొత్తగా ఉండటంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా ఎంతగానో నచ్చేసింది. విక్రమ్ సినిమాకు సీక్వెల్ తెరకెక్కితే బాగుంటుందని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అయితే బాలయ్య, వెంకటేశ్ కమల్ హాసన్ ను ఫాలో అవుతున్నారా అనే ప్రశ్నకు ఇండస్ట్రీ వర్గాల్లో అవునని వినిపిస్తోంది.
బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీ, వెంకటేశ్ శైలేష్ కొలను కాంబో మూవీ విక్రమ్ తరహాలో ఉండనున్నాయని తెలుస్తోంది. బాలయ్య, వెంకటేశ్ కమల్ ను ఫాలో అవుతుండగా ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. విక్రమ్ సక్సెస్ ఫార్ములా బాలయ్య, వెంకీలకు కూడా సక్సెస్ ను ఇస్తుందేమో తెలియాల్సి ఉంది. బాలయ్య అనిల్ కాంబో మూవీలో హనీ రోజ్ కీలక పాత్రలో నటిస్తుండగా
మెయిన్ హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వీపిస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. బాలయ్య కాజల్ కాంబినేషన్ లో ఒక్క సినిమా కూడా తెరకెక్కలేదు. అయితే కాజల్ ఈ సినిమాలో నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాజల్ సైతం రీఎంట్రీలో వరుసగా సినిమాలలో నటించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. కమల్ హాసన్ విక్రమ్ తరహా షేడ్స్ ఉన్న కథలపై టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఎక్కువగా దృష్టి పెట్టారు.
గత కొన్నేళ్లలో టాలీవుడ్ సినిమాల మార్కెట్ ఊహించని స్థాయిలో పెరగడం గమనార్హం. బాలయ్య, వెంకటేశ్ వయస్సుకు తగిన కథలను ఎంచుకుంటూ రాబోయే రోజుల్లో కూడా సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగించేలా ప్లాన్ చేసుకుంటున్నారు.