అల్లుడు అదుర్స్..సాయి శ్రీనివాస్ నటించిన తాజా చిత్రం. సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో అను ఇమాన్యుల్, నభా నటేష్ లు హీరోయిన్లుగా నటంచారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన ఈ చిత్రం మొదటి షో తోనే డివైడ్ టాక్ ను మూటకట్టుకుంది.కానీ ఓపెనింగ్స్ మాత్రం బాగానే వచ్చాయి.అయితే ఈ చిత్రానికి పాపం మన సాయి శ్రీనివాస్ కు ఎటువంటి పారితోషికం తీసుకోలేదట. అవును ఫ్రీగా చేశాడట.
నిజానికి ఈ చిత్రానికి 32కోట్ల బడ్జెట్ అయ్యింది.వీటిలో షూటింగ్ మొదలైన టైంలోనే జెమినీ టీవీ(సన్ నెక్స్ట్) వారికి శాటిలైట్ మరియు డిజిటల్ హక్కులను 8 కోట్లకు అమ్మేసారట. ఇక హిందీ డబ్బింగ్ రైట్స్ ను ఏకంగా 14కోట్లకు అమ్మారట. ఇక ఆడియో రైట్స్ ను ఆదిత్య వారికి 1 కోటికి అమ్మినట్టు తెలుస్తుంది. దీంతో రిలీజ్ కు ముందే ఈ చిత్రం 23కోట్ల రికవరీ సాధించింది. ఇదంతా సాయి శ్రీనివాస్ కు ఉన్న మార్కెట్ కారణంగానే వచ్చిన అమౌంట్.
థియేటర్ల పరంగా కూడా ఈ చిత్రం కలెక్షన్లు పర్వాలేదు అనిపించాయి. టోటల్ గా 33 కోట్ల వరకూ కలెక్ట్ చేసింది ఈ చిత్రం. అయితే 25 కోట్లకు అనుకున్న బడ్జెట్ 32 కోట్లు అయిపోవడంతో పారితోషికం వద్దన్నాడట.ఒకవేళ లాభాలు వస్తే వాటా ఇవ్వమని చెప్పాడట. కానీ అది సాధ్యం కాకపోవడంతో సాయి కి ఏమీ మిగల్లేదు అని తెలుస్తుంది.