జనవరి నెలలో సంక్రాంతి టైంలో రిలీజ్ అయిన సినిమాలు ఊహించని రేంజ్లో కలెక్ట్ చేస్తూ ఉంటాయి. కానీ ఫిబ్రవరి నెలకు వచ్చే సరికి సీన్ పూర్తిగా రివర్స్ లో ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామ్ప్స్ కి స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఈ టైంలో వాళ్ళు సినిమాల కోసం థియేటర్లకు వచ్చే పరిస్థితి ఉండదు. స్టూడెంట్స్ రాకపోతే.. థియేటర్లలో వచ్చే సినిమాలకి ఆక్యుపెన్సీ ఉండదు. అందుకే ఫిబ్రవరి నెల అనేది సినిమాలకి అన్ సీజన్ అంటుంటారు. ఈ ఏడాది ఫిబ్రవరి స్టార్ట్ అయ్యి 2 వారాలు పూర్తి కావస్తోంది. ఈ నెలలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అందుకున్న ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ సినిమా డీసెంట్ సక్సెస్ అందుకుంది కానీ బ్లాక్ బస్టర్ అనే రేంజ్లో కలెక్ట్ చేయలేదు. ‘ఈగల్’ వీకెండ్ వరకు ఓకే అనిపించినా సోమవారం రోజున కలెక్షన్స్ బాగా డ్రాప్ అయ్యాయి. ఈ వారం ‘ఊరు పేరు భైరవకోన’ వస్తుంది. ‘ఫిబ్రవరి అన్ సీజన్ కదా.. ఇలాంటి సినిమా సమ్మర్ లో రిలీజ్ చేసుకుంటే బాగా క్యాష్ చేసుకోవచ్చు కదా’ అని ఈ సినిమా బృందాన్ని అడిగితే.., వాళ్ళు ‘ప్రతి ఫిబ్రవరిలో ఒక బ్లాక్ బస్టర్ పడుతుంది’ అంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం రండి :
1) 2023 ఫిబ్రవరిలో ధనుష్ హీరోగా నటించిన ద్విభాషా(తెలుగు,తమిళ) చిత్రం ‘సార్’ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యింది. అలాగే సుహాస్ నటించిన ‘రైటర్ పద్మభూషణ్’ , కిరణ్ అబ్బవరం నటించిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’ వంటి సినిమాలు డీసెంట్ సక్సెస్ లు అందుకున్నాయి.
2) 2022 ఫిబ్రవరిలో సిద్దు జొన్నలగడ్డ నటించిన ‘డిజె టిల్లు’ బ్లాక్ బస్టర్ అయ్యింది. అలాగే ‘భీమ్లా నాయక్’ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది.
3) 2021 ఫిబ్రవరిలో వైష్ణవ్ తేజ్,కృతి శెట్టి.. జంటగా నటించిన ‘ఉప్పెన’ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. అలాగే అదే నెలలో రిలీజ్ అయిన ‘జాంబీ రెడ్డి’ ‘నాంది’ డీసెంట్ సక్సెస్..లు అందుకున్నాయి.
4) 2020 ఫిబ్రవరిలో నితిన్,రష్మిక జంటగా నటించిన ‘భీష్మ’ మంచి సక్సెస్ అందుకుంది. అలాగే అదే నెలలో రిలీజ్ అయిన విశ్వక్ సేన్ ‘హిట్'( హిట్ : ఫస్ట్ కేస్) కూడా డీసెంట్ సక్సెస్ అందుకుంది.
5) 2019 ఫిబ్రవరిలో రిలీజ్ అయిన సినిమాలు ఏవీ కూడా సక్సెస్ అందుకోలేదు.మహి వి రాఘవ్ డైరెక్ట్ చేసిన ‘యాత్ర’ మాత్రమే యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది.
6) 2018 ఫిబ్రవరిలో రిలీజ్ అయిన నాగ శౌర్య, రష్మిక..ల ‘ఛలో’ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. అలాగే వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’, నాని నిర్మాణంలో వచ్చిన ‘అ!’ కూడా సక్సెస్ అందుకున్నాయి.
7) 2017 ఫిబ్రవరిలో రిలీజ్ అయిన నాని ‘నేను లోకల్’ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. అలాగే రానా నటించిన ‘ఘాజీ’ కూడా సక్సెస్ అందుకుంది.
8) 2016 ఫిబ్రవరిలో రిలీజ్ అయిన అడివి శేష్ ‘క్షణం’ సూపర్ హిట్ అయ్యింది. అలాగే నాని నటించిన ‘కృష్ణగాడి వీర గాధ’ , ఆది పినిశెట్టి ‘మలుపు’ కూడా డీసెంట్ సక్సెస్ అందుకున్నాయి.
9) 2015 ఫిబ్రవరిలో రిలీజ్ అయిన ఎన్టీఆర్ ‘టెంపర్’ సూపర్ హిట్ అయ్యింది. శర్వానంద్ హీరోగా నటించిన ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ కూడా డీసెంట్ సక్సెస్ అందుకుంది.
10) 2014 ఫిబ్రవరిలో రిలీజ్ అయిన సునీల్ ‘భీమవరం బుల్లోడు’ (Bhimavaram Bullodu) సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అది తప్ప ఆ నెలలో రిలీజ్ అయిన సినిమాలు ఏవీ సక్సెస్ కాలేదు.