హనుమాన్ (Hanuman) మూవీ ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించింది. ప్రశాంత్ వర్మ (Prashanth Varma) డైరెక్షన్ స్కిల్స్, తేజ సజ్జా (Teja Sajja) అద్భుతమైన అభినయం, విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయి. అయితే ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు సంబంధించి మరికొన్ని సీక్రెట్స్ ను రివీల్ చేశారు. హనుమాన్ లో విగ్రహానికి చిరంజీవి (Chiranjeevi) మురుగదాస్ (A.R. Murugadoss) కాంబోలో తెరకెక్కిన స్టాలిన్ (Stalin) మూవీ పోస్టర్ రిఫరెన్స్ అని ప్రశాంత్ వర్మ పేర్కొన్నారు.
స్టాలిన్ సినిమాలో చిరంజీవి చేతులు కట్టుకుని కళ్లతోనే ఎక్స్ ప్రెషన్స్ పలికించే పోస్టర్ ను రిఫరెన్స్ గా తీసుకుని సినిమాలోని హనుమంతుని విగ్రహాన్ని క్రియేట్ చేశామని ప్రశాంత్ వర్మ తెలిపారు. చిరంజీవి స్టాలిన్ సినిమా పోస్టర్ ను చూస్తే ఏదో తెలియని గూస్ బంప్స్ వస్తుంటాయని అందుకే ఆ పోస్టర్ ను రిఫరెన్స్ గా వాడుకోవడం జరిగిందని ప్రశాంత్ వర్మ వెల్లడించారు. చిరంజీవి పోస్టర్ ను ఉపయోగించుకుని హనుమాన్ విగ్రహాన్ని క్రియేట్ చేయడంతో ఫైనల్ అవుట్ పుట్ సూపర్ గా వచ్చిందని ఆయన అన్నారు.
వైరల్ అవుతున్న వార్త విన్న మెగా అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. భవిష్యత్తులో చిరంజీవి, ప్రశాంత్ వర్మ కాంబినేషన్ ను చూడబోతున్నామని కొంతమంది ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటుండగా జై హనుమాన్ రిలీజ్ కావాలంటే మరో ఏడాదిన్నర ఆగక తప్పదని తెలుస్తోంది. బాలీవుడ్ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ప్రశాంత్ వర్మ నుంచి ఈ సినిమాలో నటించే నటీనటులకు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. హనుమాన్ సక్సెస్ తర్వాత ప్రశాంత్ వర్మ పారితోషికం పెరిగిందని సమాచారం అందుతోంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో పని చేయడానికి టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ వర్మ కెరీర్ పరంగా మరిన్ని సంచలన విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాలి.