Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన తెలుగు ఫిలిం ఛాంబర్

కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన తెలుగు ఫిలిం ఛాంబర్

  • October 3, 2024 / 08:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన తెలుగు ఫిలిం ఛాంబర్

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ప్రాతినిధ్యం వహిస్తున్న అపెక్స్ బాడీ అయిన తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్, 02-10-2024 నాడు మీడియాలో తెలంగాణకు చెందిన ఒక గౌరవనీయ మహిళా మంత్రి తెలుగు చలనచిత్ర పరిశ్రమకి చెందిన వ్యక్తుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించి చేసిన అభ్యంతరకరమైన, ధృవీకరించబడని మరియు వ్యక్తిగత వ్యాఖ్యల పట్ల బాధ మరియు ఆవేదనను వ్యక్తం చేస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా, తెలుగు సినీ సెలబ్రిటీలు మరియు ఇతర తెలుగు ఫిల్మ్ ఫ్రాటర్నిటీ సభ్యులు చాలా మందికి సులువైన టార్గెట్ గా మారారు. ఇతరుల దృష్టిని ఆకర్షించడం కోసం తెలుగు సినిమాకు సంబంధించిన వ్యక్తులపై చేసిన దుర్మార్గమైన మరియు హేయమైన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా మొత్తం తెలుగు సినీ పరిశ్రమ ఏకతాటిపై నిలబడుతుందని తెలియజేయుచున్నాము.

రాజకీయాలు మరియు చలనచిత్ర పరిశ్రమ సమాజంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. ఈ రంగాలు పరస్పర సహకారం మరియు గౌరవం అందిపుచ్చుకుంటూ సమాజంలో తమ బాధ్యతను గుర్తెరిగి ఉండడం చాలా కీలకం. రాజకీయ నాయకులు అపారమైన అధికారాన్ని కలిగి ఉంటారు మరియు సినిమాలు సాంస్కృతిక కథనాలను రూపొందిస్తాయన్నది వాస్తవం. ఈ రకమైన సంఘటనలు సమాజంలోని ప్రముఖ వ్యక్తులు మరియు వారు వుండే ప్రపంచం యొక్క వ్యత్యాసాన్ని తెలియజేస్తూ హైలైట్ అవుతాయి. ప్రజాస్వామ్య దేశంలో వాక్ స్వాతంత్య్రాన్ని ప్రభావవంతమైన వ్యక్తులు మరియు అధికారంలో ఉన్న వ్యక్తులు దుర్వినియోగం చేయకూడదాని పేర్కొనుచున్నాము.

అనేక సంవత్సరాల నుండి గమనించింది ఏమనగా, వేరే ఏదైనా సమస్యను దృష్టిని మరల్చడం కోసం తెలుగు చలనచిత్ర పరిశ్రమ లోని వ్యక్తుల వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకోవడం ఒక ఫ్యాషన్ గా మారింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మంత్రి కొండా సురేఖ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ నాగార్జున ట్వీట్!
  • 2 'దావుది' సాంగ్ పై క్లారిటీ ఇచ్చిన 'దేవర' నటి..!
  • 3 ఇప్పుడు ముందుకొచ్చారు బాగుంది.. మరి అప్పుడెందుకు రాలేదు!

సంస్కృతిని ప్రభావితం చేయడంలో మరియు సాధారణ ప్రజల దృక్కోణాలను రూపొందించడంలో ఫిల్మ్ ఫ్రాటర్నిటీ సహాయపడుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజకీయాలు జీవితాలను ప్రభావితం చేసే విధానాలను రూపొందిస్తాయి. రాజకీయ నాయకులు ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనివ్వాలి మరియు సినిమాలు సమాజంలో సామాజిక భాద్యతను తెలియజేసేలా ప్రతిబింబిస్తాయి. ఈ రెండు ప్రపంచాల మధ్య వ్యత్యాసాన్ని అందరూ అభినందిద్దాం మరియు ప్రస్తుత మరియు భవిష్యత్తు తరాలకు సమాజం యొక్క అభివృద్ధి కోసం నిర్మాణాత్మకంగా ముందుకు వెళ్దాం.

ఇలాంటి హేయమైన చర్యలను మానుకోవాలని, అందరినీ కోరుతున్నాము. మా మీడియా మిత్రులను (ప్రింట్, సోషల్, ఎలక్ట్రానిక్స్ మరియు డిజిటల్) నైతిక మరియు వివేకవంతమైన సూత్రాలు మరియు విలువలను పాటించవలసిందిగా కోరుతున్నాము.

తెలుగు చలనచిత్ర పరిశ్రమ జాతి/లింగ/మత వివక్ష లేకుండా లౌకిక సంస్థగా ఎల్లప్పుడూ ముందంజలో ఉండి అనేక జాతీయ మరియు అంతర్జాతీయ పురస్కారాలను తెచ్చిపెట్టింది.

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) ఇప్పుడు మరియు భవిష్యత్తులో తమ సభ్యులకు అండగా నిలుస్తుంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన సభ్యుల వ్యక్తిగత జీవితాలతో ముడిపడి సున్నితమైన విషయాలపై ఎవరైనా ఈ విధంగా మాట్లాడిన యెడల అలాంటి వారిపై బలమైన తగిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడరాని మరొకసారి తెలియజేస్తున్నాము.

(కె.ఎల్. దామోదర్ ప్రసాద్)
గౌరవ కార్యదర్శి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Film Chamber
  • #Konda Surekha

Also Read

Andhra King Taluka: అప్పుడు ‘మసాలా’.. ఇప్పుడు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: అప్పుడు ‘మసాలా’.. ఇప్పుడు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Ranbir Kapoor: రూ.350 కోట్ల ఇంటి స్పెషాలిటీ ఏంటి?

Ranbir Kapoor: రూ.350 కోట్ల ఇంటి స్పెషాలిటీ ఏంటి?

Divi Vadthya: ‘పుష్ప2’ ‘డాకు మహారాజ్’ వంటివి సరిపోవు

Divi Vadthya: ‘పుష్ప2’ ‘డాకు మహారాజ్’ వంటివి సరిపోవు

Andhra King Taluka Collections: ‘అఖండ 2’ ఆగిపోవడంతో బిగ్ అడ్వాంటేజ్.. కానీ?

Andhra King Taluka Collections: ‘అఖండ 2’ ఆగిపోవడంతో బిగ్ అడ్వాంటేజ్.. కానీ?

Kalyana Chakravarthi: 35 ఏళ్ళ నందమూరి హీరో రీ- ఎంట్రీ

Kalyana Chakravarthi: 35 ఏళ్ళ నందమూరి హీరో రీ- ఎంట్రీ

Mahesh Babu: ట్రైలర్ చూపిస్తే సినిమాకి ఓపెనింగ్స్ రావు అని భయపెట్టారట

Mahesh Babu: ట్రైలర్ చూపిస్తే సినిమాకి ఓపెనింగ్స్ రావు అని భయపెట్టారట

related news

Konda Surekha, Nagarjuna: నాగార్జున కి సారీ, మినిస్టర్ కొండా సురేఖ ట్వీట్

Konda Surekha, Nagarjuna: నాగార్జున కి సారీ, మినిస్టర్ కొండా సురేఖ ట్వీట్

trending news

Andhra King Taluka: అప్పుడు ‘మసాలా’.. ఇప్పుడు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: అప్పుడు ‘మసాలా’.. ఇప్పుడు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

12 hours ago
Ranbir Kapoor: రూ.350 కోట్ల ఇంటి స్పెషాలిటీ ఏంటి?

Ranbir Kapoor: రూ.350 కోట్ల ఇంటి స్పెషాలిటీ ఏంటి?

13 hours ago
Divi Vadthya: ‘పుష్ప2’ ‘డాకు మహారాజ్’ వంటివి సరిపోవు

Divi Vadthya: ‘పుష్ప2’ ‘డాకు మహారాజ్’ వంటివి సరిపోవు

14 hours ago
Andhra King Taluka Collections: ‘అఖండ 2’ ఆగిపోవడంతో బిగ్ అడ్వాంటేజ్.. కానీ?

Andhra King Taluka Collections: ‘అఖండ 2’ ఆగిపోవడంతో బిగ్ అడ్వాంటేజ్.. కానీ?

15 hours ago
Kalyana Chakravarthi: 35 ఏళ్ళ నందమూరి హీరో రీ- ఎంట్రీ

Kalyana Chakravarthi: 35 ఏళ్ళ నందమూరి హీరో రీ- ఎంట్రీ

16 hours ago

latest news

BAAHUBALI: జపాన్ వెళ్లిన ‘బాహుబలి’.. వెనకాలే వచ్చిన జక్కన్న లేఖ! అందులో ఏముందంటే?

BAAHUBALI: జపాన్ వెళ్లిన ‘బాహుబలి’.. వెనకాలే వచ్చిన జక్కన్న లేఖ! అందులో ఏముందంటే?

15 hours ago
Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి పెళ్లి పీటలు ఎక్కబోతోందా? ఆ హీరోతో డేటింగ్ వార్తల్లో నిజమెంత?

Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి పెళ్లి పీటలు ఎక్కబోతోందా? ఆ హీరోతో డేటింగ్ వార్తల్లో నిజమెంత?

15 hours ago
Peddi: ‘పెద్ది’కి నార్త్ లో గట్టి పోటీ.. ఆ మూడు సినిమాలతో డేంజర్ బెల్స్!

Peddi: ‘పెద్ది’కి నార్త్ లో గట్టి పోటీ.. ఆ మూడు సినిమాలతో డేంజర్ బెల్స్!

16 hours ago
‘సనాతన ధర్మం’ కాన్సెప్ట్ సినిమాలకి ఇదేం పరిస్థితి?

‘సనాతన ధర్మం’ కాన్సెప్ట్ సినిమాలకి ఇదేం పరిస్థితి?

18 hours ago
Ravi Teja: రవితేజ సినిమాలకి స్టార్ హీరోయిన్లు దూరం

Ravi Teja: రవితేజ సినిమాలకి స్టార్ హీరోయిన్లు దూరం

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version