Gopichand: సలార్ మూవీలో రోల్ పై గోపీచంద్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆయనవల్లే అంటూ?

గోపీచంద్ (Gopichand) హీరోగా నటించిన భీమా మూవీ మరికొన్ని రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది. (Bhimaa) భీమా సినిమాకు ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. ఈ సినిమాకు బుకింగ్స్ అదిరిపోయే రేంజ్ లో ఉన్నాయి. ప్రభాస్ (Prabhas) గోపీచంద్ మధ్య స్నేహ బంధం ఉందనే సంగతి తెలిసిందే. సలార్ (Salaar) సినిమాలో పృథ్వీరాజ్ (Prithviraj Sukumaran) పాత్రలో గోపీచంద్ నటించి ఉంటే బాగుండేదంటూ కామెంట్లు వినిపించాయి. ఈ కామెంట్లు తన దృష్టికి కూడా రావడంతో గోపీచంద్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ప్రతి సినిమా పాన్ ఇండియాకు వర్కౌట్ కాదని గోపీచంద్ వెల్లడించారు. ప్రభాస్ కు మాత్రమే పాన్ ఇండియా సినిమాలు వర్కౌట్ అయ్యాయని గోపీచంద్ చెప్పుకొచ్చారు. సలార్ మూవీ ఇద్దరు ఫ్రెండ్స్ స్టోరీ అని ఆ సినిమాలో పృథ్వీరాజ్ రోల్ లో నేను యాక్ట్ చేసి ఉంటే బాగుండేదేమో చెప్పలేనని ఆయన తెలిపారు. నాకు, ప్రభాస్ కు మధ్య ఆ బాండింగ్ ఉందని గోపీచంద్ వెల్లడించారు. ప్రభాస్ సినిమాలో ఫ్రెండ్ రోల్ అనేది దర్శకుడు ఛాయిస్ అని గోపీచంద్ వెల్లడించారు.

సలార్ లో ఫ్రెండ్ రోల్ లో పృథ్వీరాజ్ బాగా చేశారని గోపీచంద్ పేర్కొన్నారు. ప్రభాస్ తో సినిమా చేయాలంటే కాలం కలిసిరావాలని గోపీచంద్ చెప్పుకొచ్చారు. ప్రభాస్ తో సినిమా కచ్చితంగా చేస్తానని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభాస్, గోపీచంద్ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు వస్తుందో చూడాల్సి ఉంది. భీమా సినిమాతో గోపీచంద్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది.

భీమా సినిమాలో యాక్షన్ సీన్స్ స్పెషల్ గా ఉంటాయని సమాచారం అందుతోంది. భీమా మూవీ రిజల్ట్ విషయంలో గోపీచంద్ పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. భీమా మూవీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. భీమా మూవీ రికార్డ్ స్థాయి స్క్రీన్లలో రిలీజవుతోంది. గోపీచంద్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.

‘సలార్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?!

నయన్ విఘ్నేష్ మధ్య విబేధాలకు అదే కారణమా.. అసలేమైందంటే?
నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. వరుడి బ్యాగ్రౌండ్ ఇదే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus