‘రోలెక్స్’.. ఈ పాత్ర గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇన్స్టా రీల్స్ లో ఎక్కడ చూసినా ఈ పాత్రకి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వినిపిస్తుంది. జూన్ నెలలో రిలీజ్ అయిన విక్రమ్ సినిమాలో పాత్ర అది. సినిమా చివర్లో డ్రగ్ మాఫియా కింగ్ గా సూర్య దర్శనమిస్తాడు. అతను సినిమాలో కనిపించేది గట్టిగా 5,6 నిమిషాలే అయినప్పటికీ… ఓ సినిమా మొత్తం సరిపడేంత మాస్ స్టఫ్ అందించాడు.
ఆ కాసేపు ’24’ లో ఆత్రేయ రేంజ్ లో విలనిజం చూపించి ప్రేక్షకులను భయపెట్టాడు. సూర్య ఎంట్రీ సీన్ నుండి అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా టాప్ నాచ్ అనే విధంగా ఉంటుంది. చెన్నైలో కొన్ని చోట్ల అయితే సూర్య ఎంట్రీ సీన్ కి ఆడియో బాక్సులు బద్దలవడం, స్క్రీన్లు తగలబడడం కూడా జరిగింది.ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. రోలెక్స్ పాత్ర పై ఇటీవల సూర్య చేసిన కామెంట్స్ అందరికీ షాకిస్తున్నాయి.
నిజానికి ఈ పాత్రని చేయడం మొదట అతనికి ఇష్టం లేదట. ఈ విషయాన్ని స్వయంగా సూర్య తెలియజేశాడు.తాజాగా జరిగిన సైమా అవార్డ్స్ వేడుకల్లో సూర్య మాట్లాడుతూ.. “ఈరోజు నేను ఏం చేసినా, జీవితంలో ఈ స్థాయిలో ఉన్నాను అంటే అది కమల్ హాసన్ సర్ ఇచ్చిన స్ఫూర్తి అనే చెప్పాలి. ఆయన ఫోన్ చేసి అవకాశం ఉందని చెప్పినప్పుడు వదులుకోదల్చుకోలేదు. భయపెట్టిన పనిని చేస్తే మనకు ఎదుగుదల అని నమ్ముతాను.కమల్ సర్ చెప్పిన మాటే అది.
అందుకే దర్శకుడు లోకేష్ నాకు రోలెక్స్ గురించి చెప్పినప్పుడు చేయలేను అని చెబుదామనుకున్నాను.కానీ లాస్ట్ మినిట్ లో మనసు మార్చుకుని ఓకే చెప్పేశాను. అది కేవలం ఓ వ్యక్తి కోసమే. ఆయనే మన లోకనాయకుడు కమల్ హాసన్’ అంటూ సూర్య చెప్పుకొచ్చాడు.
Most Recommended Video
ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!