సీనియర్ నటుడు చంద్రమోహన్ మరణించిన తర్వాత ఆయనకు సంబంధించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఈయన సంపాదించినది దానిలో ఎక్కువ శాతం భూములపై పెట్టుబడులు పెట్టారు. ఈ విధంగా శోభన్ బాబు తర్వాత అదే స్థాయిలో భూములను కొనుగోలు చేసినటువంటి వారిలో చంద్రమోహన్ ఒకరు. ఇక అప్పట్లో కబ్జాలు ఎక్కువగా చేస్తున్నటువంటి నేపథ్యంలో భయపడి చంద్రమోహన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నటువంటి 6 ఎకరాలను అమ్ముకున్నారు.
అదే ఉంటే ఈపాటికి వందల కోట్ల ఆస్తి తన సొంతమయ్యేదని పలు ఇంటర్వ్యూలలో చంద్రమోహన్ వెల్లడించారు. అయినప్పటికీ ఈయన హైదరాబాద్లో మరికొన్ని ప్రదేశాలలో కూడా పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని తెలుస్తోంది. చంద్రమోహన్ బ్యాంక్ బ్యాలెన్స్ ఇండ్లు వంటివి కాకుండా సంపాదించిన భూముల విలువని సుమారు 300 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.
ఇక ఈయన మరణించిన తర్వాత ఆస్తి మొత్తం ఎవరికీ చెందాలి అనే విషయం గురించి ముందుగానే వీలునామా రాసినట్టు తెలుస్తోంది. ఈ వీలునామాలో భాగంగా తన 300 కోట్ల ఆస్తిలో తన ఇద్దరు కుమార్తెలకు భాగం ఉంటుందని రాశారట. ఈయనకు కొడుకుల లేకపోవడంతో ఆస్తి మొత్తం తన ఇద్దరి కూతుళ్ళకే చెందాలని రాశారు.
ఇక ఈయనకు (Chandra Mohan) కొడుకులు లేకపోవడంతో చనిపోయిన తర్వాత ఎవరైతే తనకు తల కొరివి పెడతారో వాళ్లకి అదనంగా మరో 20 శాతం వాటా దక్కేల ఈయన వీలునామాలు రాశారని తెలుస్తోంది. ఈ 300 కోట్ల మాత్రమే కాకుండా ఈయనకు హైదరాబాద్లో పలు ఇల్లు కూడా ఉన్నాయని అలాగే పెద్ద మొత్తంలో బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఉందని తెలుస్తోంది.