నాని ఇది వరకు వరుస సినిమాలు లైన్లో పెట్టేవాడు. కానీ ఇప్పుడు ఎందుకో కాస్త స్లో అయ్యాడు అనే టాక్ ఎక్కువగా వినిపిస్తుంది. ఈ ఏడాది ‘దసరా’ తో సూపర్ హిట్ అందుకున్న నాని.. డిసెంబర్లో ‘హాయ్ నాన్న’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. శౌర్యవ్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన మూవీ ఇది. అయినప్పటికీ టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది. సినిమాపై కొద్దిపాటి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే దీని తర్వాత నాని ఏ దర్శకుడితో సినిమా చేస్తాడు అనే క్లారిటీ ఇచ్చింది లేదు.
‘జైభీమ్’ దర్శకుడితో రజినీకాంత్ చేస్తున్న మూవీలో (Nani) నాని ఎంపికైనట్టు ప్రచారం జరిగింది. కానీ నాని టీం ఆ విషయాన్ని కొట్టిపారేసింది. తర్వాత బాలయ్య- బాబీ కాంబినేషన్లో రూపొందుతున్న మూవీలో నాని కూడా నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ ‘జెర్సీ’ టైంలోనే నానికి కొంత అడ్వాన్స్ ఇచ్చింది. కానీ ఇప్పటికీ వాళ్ళకి సినిమా చేయలేదు నాని. కాబట్టి బాలయ్యతో నాని కలిసి నటించడానికి అంగీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోపక్క ‘స్కంద’ నిర్మాత ‘శ్రీనివాస సిల్వర్ స్క్రీన్’ అధినేత అయిన శ్రీనివాస చిట్టూరి నిర్మాణంలో కూడా నాని ఓ సినిమా చేయబోతున్నట్టు టాక్ గట్టిగా వినిపిస్తుంది. శివ కార్తికేయన్ తో ‘డాన్'(తెలుగులో కాలేజ్ డాన్) చిత్రాన్ని తెరకెక్కించిన సిబి చక్రవర్తి ఈ ప్రాజెక్టుని డైరెక్ట్ చేయనున్నాడట. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది అని తెలుస్తుంది.