ఏపీ సీఎం జగన్ తమ పార్టీలో ఉన్న సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తులకు కీలక పదవులు కట్టబెడుతున్నారు.. ఇప్పటికే ఎమ్మెల్యేగా గెలిచిన రోజాను మంత్రిని చేశారు.. పార్టీకి సినీ గ్లామర్ యాడ్ అవడం మంచిదేనని జగన్ భావిస్తున్నట్టున్నారు.. అందుకే మొన్న ఆలీ, ఇవాళ పోసాని కృష్ణ మురళిలకు పదవులిచ్చి గౌరవించారు.. ఇటీవల 30 ఇయర్స్ పృథ్వీ బహిరంగంగానే ప్రభుత్వం మీద కామెంట్స్ చేసి పార్టీకి దూరమైపోయాడు.. సినిమా వాళ్లకి పార్టీలో తగిన ప్రాధాన్యతనివ్వాలనుకుని జగన్..
ఆలీ, పోసానిలకు పదవులిచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి.. సీనియర్ నటుడు, కామెడీ కింగ్ ఆలీని ఈమధ్యే అధికార ప్రభుత్వం సలహాదారు పదవికి ఎంపిక చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియామకమైన ఆలీ రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. మీడియా సలహాదారుడిగా సినీ రంగానికి చెందిన వ్యక్తిని ఎంపిక చెయ్యడం మంచి పరిణామమని, ఏపీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయం.. పరిశ్రమలో అజాత శత్రువుగా పేరొందిన ఆలీ ఈ పదవికి సమర్థుడని..
ఇండస్ట్రీకి, మీడియాకి మధ్య వారధిలా ఆయన పనిచేస్తారంటూ పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఆలీకి శుభాకాంక్షలు తెలియజేశారు. తనకు పదవి ఇచ్చినందుకు ఆలీ దంపతులు తాడేపల్లిలో సీఎంని కలిసి ధన్యవాదాలు తెలియజేశారు.. ఇప్పుడు నటుడు, రచయిత. దర్శకుడు పోసానిని ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్టు ముక్కుసూటిగా మాట్లాడే పోసాని 2019 ఎన్నికలప్పుడు వైసీపీ తరపున ప్రచారం చేశారు..
అప్పటినుండి పార్టీలో కొనసాగుతున్నారాయన.. జగన్‌ని కానీ ప్రభుత్వాన్ని కానీ విమర్శిస్తే వారిపై తన స్టైల్లో విరుచుకుపడుతుంటారు.. ఆంధ్రప్రదేశ్ ఫిలిం, టెలివిజన్ మరియు థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా తనను ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు పోసాని.. గతకొంత కాలంగా నటుడిగా బిజీ కావడం వల్ల డైరెక్షన్‌కి దూరంగా ఉంటున్న ఈ ఫైర్ బ్రాండ్.. ఏపీ ప్రభుత్వం సాయంతో సినీ పరిశ్రమకి తన వంతు మేలు జరిగేలా చూస్తానని సన్నిహితుల వద్ద చెప్పారని కూడా సమాచారం..