ఒకప్పుడు సినిమా అనేది థియేట్రికల్ రన్ ముగిసేసరికి రూ.100 కోట్లు కలెక్ట్ చేయడమే గొప్ప విషయం అన్నట్టు చెప్పుకునే వారు. కానీ ఇప్పుడు కాలం మారింది. రూ.100 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేయడం ప్రతి సినిమాకి కేక్ వాక్ అయిపోయింది. ఆ తర్వాత చాలా సినిమాలు రూ.100 కోట్లు షేర్ కలెక్ట్ చేయడం వంటివి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆ లెక్క రూ.1000 కోట్ల వరకు కూడా చేరుకుంది. అందులో భాగంగా మొదటి రోజు ఎంత మొత్తం కలెక్ట్ చేస్తుంది అనే విషయం పై కూడా జనాల ఫోకస్ ఎక్కువగా పడింది.
ఈ క్రమంలో కొన్ని సినిమాలు మొదటి రోజే రూ.100 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించి చరిత్ర సృష్టిస్తున్నాయి. రాజమౌళి, ప్రభాస్, షారుఖ్ ఖాన్, ప్రశాంత్ నీల్ వంటి స్టార్లకి ఈ ఫీట్ అనేది కేక్ వాక్ అయిపోయింది. సరే మొదటి రోజు రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
1) ఆర్.ఆర్.ఆర్ :
దర్శకధీరుడు, పాన్ వరల్డ్ డైరెక్టర్ గా స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న రాజమౌళి దర్శకత్వంలో రాంచరణ్, ఎన్టీఆర్..లు హీరోలుగా నటించిన ఈ సినిమా మొదటి రోజు ఏకంగా రూ.220 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను సాధించి నెంబర్ 1 ప్లేస్ లో కొనసాగుతుంది. ఈ సినిమా ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
2) బాహుబలి 2 :
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించాడు. మొదటి రోజు ఈ సినిమా ఏకంగా రూ.210 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను సాధించి ఆల్ టైం రికార్డులు సృష్టించింది. ఈ సినిమా ఎపిక్ బ్లాక్
3) సలార్ :
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ‘సలార్’ మొదటి భాగం అయిన ‘సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్’ చిత్రం మొదటి రోజు రూ.166 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.
4) కె.జి.ఎఫ్ చాప్టర్ 2 :
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా నటించిన ఈ సినిమా రెండో మొదటి రోజు రూ.162 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను సాధించింది.
5) లియో :
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ విజయ్ , స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘లియో’.. మొదటి రోజు ఏకంగా రూ.145 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.
6) ఆదిపురుష్ :
ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమా మొదటి రోజు రూ.137 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.
7) జవాన్ :
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ‘జవాన్’ మూవీ మొదటి రోజు ఏకంగా రూ.126 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.
8) సాహో :
ప్రభాస్ హీరోగా సుజీత్ కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా మొదటి రోజు ఏకంగా రూ.125 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టింది.
9) యానిమల్ :
రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మొదటి రోజు ఏకంగా రూ.115 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టింది.
10) పఠాన్ :
షారుఖ్ ఖాన్ హీరోగా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ మొదటి రోజు ఏకంగా రూ.105 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.
రాబోయే రోజుల్లో టాలీవుడ్ నుండి ‘పుష్ప’ ‘గేమ్ ఛేంజర్’ వంటి సినిమాలు కూడా మొదటి రోజు రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించే అవకాశం ఉంది. ఇంకా ఈ లిస్ట్ లోకి ఏ సినిమాలు చేరతాయో చూడాలి.