విజయ్‌ – లోకేశ్ సినిమాకు కొబ్బరికాయ కొట్టారట!

లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్.. ‘విక్రమ్‌’ సినిమా వచ్చాక అందరూ ఆ సినిమాతోపాటు దీని గురించి కూడా మాట్లాడుకున్నారు. కారణం సౌత్‌లో ఇలాంటి యూనివర్శ్‌లు బాగా తక్కువ కావడం, అలాగే ఆసక్తికరంగా ఉండటం కూడా. ఇప్పుడు దీని గురించి ఎందుకు అనుకుంటున్నారా? ఆ యూనివర్స్‌లో మరో సినిమా మొదలైంది అని టాక్‌ రావడమే. విజయ్‌తో లోకేశ్‌ కనగరాజ్‌ సినిమా చాలా రోజుల క్రితమే అనౌన్స్‌ అయ్యింది. ఇప్పుడు ఆ సినిమాకు కొబ్బరికాయ కొట్టారు.

విజయ్‌ – లోకేష్‌ కనగరాజ్‌ కలయికలో సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియో పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సోమవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైందని సమాచారం. గ్యాంగ్‌స్టర్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతుందని ఇప్పటికే వార్తలొచ్చాయి. అయితే ఈ సినిమా ‘లోకేష్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌’లో భాగంగా వస్తుందా లేదా అనే డౌట్ ఉంది. అయితే ఇప్పుడు అందులో భాగమే అని అంటున్నారు. ‘వారసుడు’ సినిమా చిత్రీకరణ చివరి దశకు రావడం,

సంక్రాంతికి ఆ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. దీంతో లోకేశ్‌ సినిమా జనవరిలో రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలుపెడతారట. సినిమా తొలి షెడ్యూల్‌ను కశ్మీర్‌, మున్నార్‌ ప్రాంతాల్లో నిర్వహిస్తారట. దీని బట్టి చూస్తే ఈ సినిమా అంతరాష్ట్ర గ్యాంగ్‌స్టర్ల నేపథ్యంలో ఉంటుంది అని చెబుతున్నారు. సినిమా మొదలయ్యాక ఈ విషయంలో మరింత క్లారిటీ వస్తుంది. ఈ సినిమాలో కథానాయికగా త్రిష పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఇంకో హీరోయిన్‌ కూడా ఉంటుంది అంటున్నారు.

అలాగే విలన్‌గా బాలీవుడ్‌ స్టార్‌ సంజయ్‌ దత్‌ను తీసుకుంటున్నారట. అయితే ఈ సినిమాను ‘లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌’లో కలపడంతోపాటు.. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘మాస్టర్‌’ను కూడా యాడ్‌ చేసేలా సీన్స్‌ ఉంటాయి అంటున్నారు. అయితే ఈ సినిమాలో ఢిల్లీ, రోలెక్స్‌, విక్రమ్‌ కనిపిస్తారా అనేది తెలియాల్సి ఉంది. అయితే వారు కనిపించకపోయినా.. వాళ్ల వాయిస్‌లు అయినా వినిపిస్తాయి అంటున్నారు. ‘విక్రమ్‌’లోనూ ఇదే ప్రయత్నం చేశారు. ఇప్పుడూ అదే పని చేస్తే కోలీవుడ్‌లో ఇదో సంచనలం అని చెప్పొచ్చు.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus