సినిమా ఇండస్ట్రీలో కొంతకాలంగా ఫ్యాన్స్ వార్స్ ఎక్కువయ్యాయని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. తామంతా ఒక్కటేనని హీరోలు అనేక సార్లు చెబుతున్నా.. అభిమానులు మాత్రం తమ మాటలు యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్నాళ్లుగా మరీ ఎక్కువగా కనిపిస్తుందనే చెప్పాలి. ఆ ఫ్యాన్స్ వార్స్ వల్ల సినిమాలకు కొంతమేరకు నష్టం జరుగుతుంది! దాన్ని ఆపాలని సెలబ్రిటీలు వివిధ విధాలుగా విజ్ఞప్తి చేస్తున్నా అది జరగడం లేదు.
Krishna Kanth
ఇప్పుడు టాక్సిటీ వల్ల పాటల విషయంలో చాలా ఇబ్బందులు ఎదురువుతున్నాయని లిరిసిస్ట్ కృష్ణ కాంత్ (Krishna Kanth) అభిప్రాయపడ్డారు. కేకేగా ఆయన అందరికీ సుపరిచితమే. ఇటీవల ప్రత్యేకంగా ఫిల్మీ ఫోకస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేకే కీలక కామెంట్స్ చేశారు. “ఒక పాట బాగుందంటే ఒకప్పుడు మ్యాగ్ జైన్స్ లో లిరికల్ రివ్యూస్ వచ్చేవి.. పాట మీనింగ్ చెప్పేవారు.. ఓ విషయాన్ని అద్భుతంగా వివరించారు అని రాసేవారు” అని హోస్ట్ అనగా.. అలాంటివి ఇప్పుడు లేవ్ అని కేకే అన్నారు. సినిమాల రివ్యూసే లేవుగా అని చెబుతూ నవ్వారు.
“ఇప్పుడు సినిమా రివ్యూస్ లేవ్ అండి.. అన్నీ యూట్యూబ్ లోనే.. ఒకప్పుడు చాలా రివ్యూస్ వచ్చేవి.. అవి చదివి తెలుసుకునేవాళ్లం. నేను కూడా చదివేవాడిని. కానీ ఇప్పుడు రివ్యూస్ చూసి మూవీ చూడాలనుకుంటున్నారు.. లిరిక్స్ ను ఆడియన్సే జడ్జ్ చేయాలి. కానీ లిరికల్ రివ్యూస్ తగ్గిపోయాయి. టాక్సిటీ ఎక్కువైపోయింది” అని చెప్పారు. “ఓ పాట రిలీజ్ అయినా.. ఆలోచించి పోస్ట్ చేస్తున్నాం.. ఫ్యాన్స్ వార్స్ ఎక్కువయ్యాయి.. ఒక్క సాంగ్ కోసం పోస్ట్ చేసినా చెత్త పాట అని రివ్యూ ఇస్తున్నారు.. సాంగ్ రాయడమే నా కంట్రోల్ లో ఉంటుంది.. వచ్చాక రిజల్ట్ మన చేతిలో లేదు..
హిట్ అయితే సంతోషిస్తాం.. సినిమా ఫ్లాప్ అయినా కొన్నిసార్లు సాంగ్ కు గుర్తింపు రాదు” అని తెలిపారు కేకే. ట్విట్టర్ లోకి నా సాంగ్ అని చెప్పి వినమన్నా ఎవరూ వినరు అంటూ నవ్వుతూ అన్నారు. ప్రస్తుతం లిరిసిస్ట్ కృష్ణ కాంత్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒక్కొక్కరు ఒక్కోలా రెస్పాండ్ అవుతున్నారు. అయితే సూపర్ హిట్ మూవీ అందాల రాక్షసిలోని వెన్నంటే ఉంటున్నా సాంగ్ తో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు కేకే (Krishna Kanth). ఆ తర్వాత వివిధ చిత్రాలకు పాటలు అందించారు. ఇప్పుడు కీలక కామెంట్స్ తో వార్తల్లో నిలిచారు.