మహేష్ రాజమౌళి కాంబినేషన్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. 2024 సంవత్సరంలో ఈ సినిమా మొదలుకానుందని 2026 సంవత్సరంలో ఈ సినిమా రిలీజయ్యే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. అయితే జక్కన్న డైరెక్షన్ లో నటిస్తే ఆ హీరో తర్వాత మూవీ ఫ్లాప్ అవుతుందని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అయితే మహేష్ మాత్రం జక్కన్న మూవీ తర్వాత మూవీని భారీ లెవెల్ లో ప్లాన్ చేసుకుంటున్నారట. ఈ సినిమా భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కేలా ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది.
తనతో పాటు ఇతర హీరోలు ఉండేలా మహేష్ మాస్టర్ ప్లాన్ చేశారని సమాచారం అందుతోంది. మహేష్ బాబు గుంటూరు కారం సినిమా నుంచి ఈ నెల 7వ తేదీన ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది. ఈ సాంగ్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసేలా ఉండనుందని టాక్ వినిపిస్తోంది. రాజమౌళి సైతం తన సినీ కెరీర్ లో ఒక సినిమా కోసం ఐదేళ్ల సమయం కేటాయించడం మహేష్ సినిమా విషయంలోనే జరుగుతోంది.
హాలీవుడ్ లెవెల్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో హాలీవుడ్ నటులకు ఎక్కువగానే ప్రాధాన్యత ఉండనుందని సమాచారం అందుతోంది. రాజమౌళి నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటూ దేశవిదేశాల్లో సత్తా చాటుతున్నారు. రాజమౌళి సినిమా సినిమాకు కథల విషయంలో చూపిస్తున్న వైవిధ్యం కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. జక్కన్న పారితోషికం, రేంజ్ ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి.
జక్కన్న మారుతున్న టెక్నాలజీలకు అనుగుణంగా తనను తాను మార్చుకుంటూ విజయాలను సొంతం చేసుకుంటున్నారు. రాజమౌళిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 1000 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. జక్కన్న కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. రాజమౌళి (Rajamouli) తర్వాత ప్రాజెక్ట్ ల గురించి పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది.