ఈ మధ్య కాలంలో వరుసగా సినీ పరిశ్రమలో విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. శరత్ బాబు, గద్దర్ వంటి దిగ్గజ నటులు ఈ మధ్యనే కన్నుమూశారు. ఆ తర్వాత ఇంకా చాలా మంది సినీ సెలబ్రిటీలు కన్నుమూశారు. నిత్యం ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వింటూనే ఉన్నాం. గద్దర్ మరణవార్త నుండి ఈ వార్తలు ఇంకా ఎక్కువయ్యాయి అని కొందరు భావిస్తున్నారు. ప్రమాదాల వల్లో లేక అనారోగ్య సమస్యలతోనో లేదంటే వయసు సంబంధిత సమస్యలతోనో సెలబ్రిటీలు మరణిస్తూ ఉండటం మనం చూశాం.
అలాగే నటీనటులు, నిర్మాతలు, దర్శకులు మాత్రమే కాకుండా టెక్నికల్ టీం.. లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇలా ఎవరొకరు మరణిస్తూనే ఉన్నారు. తాజాగా మరో నటి మరణించిన వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మలయాళ సీరియల్ నటి అపర్ణ నాయర్.. తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. గురువారం రాత్రి కారామన ఏరియాలోని ఉన్న తన నివాసంలోనే ఆమె చనిపోయి విగతజీవిగా పడి ఉన్నట్టు సమాచారం.
ఇది అనుమానాస్పద మృతి కాబట్టి.. పోలీస్ కేసు ఫైల్ అయ్యింది. స్థానిక పోలీసులు రంగంలోకి దిగి.. ఆమె ఆత్మహత్య వెనుక ఉన్న కారణాలు ఏంటి? అనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్లే ఆమె సూసైడ్ చేసుకుని చనిపోయినట్టు పోలీసులు గుర్తించారు. అపర్ణ నాయర్‌కు భర్త, ఇద్దరు కూతుళ్లు ఉన్నట్టు తెలుస్తుంది. మేఘతీర్థం, కదలు పరాంజ కథ వంటి సినిమాల్లో అపర్ణ నటించింది.