తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెస్ మీట్ కు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంచు విష్ణు ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తనకు ప్రాంతీయంగా మాట్లాడడం తెలియదని.. అందరం తెలుగువాళ్లం కాబట్టి కలిసికట్టుగా ఉండాలని చెప్పారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంచి పాలసీలతో ఇండస్ట్రీని కాపాడుతున్నారని..
ఇండస్ట్రీలో ఉన్నవాళ్లందరూ అద్దాల మేడలో ఉండేవాళ్లమని.. మేం ఎవరిపైనా.. రాళ్లు విసరకూడదని.. మేం మాట్లాడే విషయాల వలన వేరేవాళ్లు తమపై రాళ్లు విసరకూడదని అన్నారు. ఎవరు ఎవరిపై రాళ్లు విసిరినా.. నష్టం మాకే అంటూ చెప్పుకొచ్చారు. ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చేప్పుడు ఆచితూచి ఇవ్వాలని.. పవర్ లో ఉన్నవాళ్లు స్టార్స్ అయినా.. ఇచ్చే స్టేట్మెంట్స్ ఎఫెక్ట్ ఇండస్ట్రీపై పడుతుందని.. కాబట్టి ఇండస్ట్రీని దృష్టిలో పెట్టుకొని ఐకమత్యంగా ఉంటూ.. అందరి తరఫున స్టేట్మెంట్ ఇవ్వాలని అన్నారు. అలా ఇవ్వని పక్షంలో వ్యక్తిగతంగా స్టేట్మెంట్ ఇస్తున్నానని చెప్పుకోవాలని సూచించారు మంచు విష్ణు.