ఈ మధ్య ప్రేక్షకులు బాగా షార్ప్ అయ్యారు. ఒకప్పటిలా ‘టేక్ ఇట్’ ‘గ్రాంటెడ్’ అదేవిధంగా లేరు. పెట్టిన టికెట్ కి క్వాలిటీ కావాలని ఆశిస్తున్నారు. విషయం ఏంటంటే.. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో వీఎఫ్ఎక్స్ కనుక లోపంగా అనిపిస్తే.. వెంటనే పెదవి విరుస్తున్నారు. సోషల్ మీడియాలో నెటిజెన్ల సంగతి ఇక చెప్పనవసరం లేదు. ‘ఆదిపురుష్’ (Adipurush) సినిమా విఎఫ్ఎక్స్ విషయంలో నేషనల్ లెవెల్లో ట్రోల్ చేసి.. దానిని ట్రెండ్ చేసి కానీ వదల్లేదు.
Vishwambhara
అంతకు ముందు వచ్చిన ‘శాకుంతలం’ (Shaakuntalam) సినిమా విషయంలో కూడా అంతే. అలాగే ఇటీవల వచ్చిన ‘దేవర’ (Devara) సినిమా ట్రైలర్ రిలీజ్ టైంలో కూడా ‘ఫైర్’ షాట్ గురించి చాలా నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. దీంతో పెద్ద సినిమా యూనిట్స్ తమ కంటెంట్ ను విడుదల చేయడానికి భయపడుతున్నాయి.మరోపక్క మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన ‘విశ్వంభర’ (Vishwambhara) చిత్రం టీజర్ కూడా రేపు అనగా దసరా కానుకగా విడుదల చేయబోతున్నారు.
ఈ టీజర్ విషయంలో కూడా అభిమానాలు కంగారు పడుతున్నారు. ఎందుకంటే ఈ సినిమా విఎఫ్ఎక్స్ కూడా సరిగ్గా రాలేదు అని భావించి.. విడుదలని సంక్రాంతి టైం నుండి వాయిదా వేశారని టాక్ నడుస్తుంది. కొత్త రిలీజ్ డేట్ ను ఈ టీజర్ ద్వారా రివీల్ చేయబోతున్నారు అనే టాక్ కూడా నడుస్తోంది. ఇక ‘విశ్వంభర’ ఓ సోసియో ఫాంటసీ మూవీ.
అందువల్ల టీజర్లో వీఎఫ్ఎక్స్ సంబంధించిన విజువల్స్ కూడా ఉండాలి. అవి కనుక సరిగ్గా లేవు అంటే ట్రోలింగ్ తప్పదు. ఇలాంటి ట్రోలింగ్..ల వల్ల సినిమా బిజినెస్..లు కూడా దెబ్బ తింటున్నాయి. అందుకే ‘విశ్వంభర’ మేకర్స్ కూడా కొంచెం టెన్షన్ పడుతున్నట్లు వినికిడి.