టాలీవుడ్ లో ఉన్న మిడ్ రేంజ్ హీరోల్లో నానికి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఆయన సినిమాలంటే ఎగబడి చూస్తారు. అందుకే దర్శకనిర్మాతలు ఆయనతో కలిసి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. ఒక్కో సినిమాకి నాని తీసుకునే రెమ్యునరేషన్ కూడా చాలా ఎక్కువ. ఒకప్పుడు రూ.9 కోట్లు తీసుకునే నాని.. ఇప్పుడు రూ.15 కోట్లు తీసుకుంటున్నారు. ఆయనకున్న క్రేజ్ కారణంగా నిర్మాతలు అడిగినంత పారితోషికం ఇస్తున్నారు.
నిజం చెప్పాలంటే.. ఈ మధ్యకాలంలో నానికి హిట్స్ పడడం లేదు. ఒక్క ‘శ్యామ్ సింగరాయ్’ మాత్రం మంచి సక్సెస్ అయింది. పైగా ఆయన సినిమాలకు నాన్-థియేట్రికల్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరుగుతుంది. అందుకే నాని కూడా తన రెమ్యునరేషన్ తగ్గించాలనుకోవడం లేదు. కానీ ఆయన సినిమాలకు థియేట్రికల్ మార్కెట్ మరింత తగ్గిపోతుంది. జూన్ 10న ఆయన నటించిన ‘అంటే సుందరానికీ’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికి ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపు పూర్తయినట్లే.
రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి ఈ సినిమా రూ.12 కోట్లు వసూలు చేసింది. యూఎస్ మార్కెట్ లో మాత్రం నాని సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చాయి. కానీ ఈ థియేట్రికల్ రెవెన్యూ నాని రెమ్యునరేషన్ కూడా కవర్ చేయలేదని తెలుస్తోంది. ఆయన సినిమాలు గనుక ఇలానే బాక్సాఫీస్ వద్ద ఆడితే ఇక నాని ఇమేజ్ పై ఎఫెక్ట్ పడడం ఖాయం. ఇప్పటికైనా నాని తన తన సినిమాలకొచ్చే రికవరీ బట్టి రెమ్యునరేషన్ ఫిక్స్ చేసుకుంటే నిర్మాతలకు కాస్తయినా భారం తగ్గుతుంది.