నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఎఫ్3 సినిమాతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారనే సంగతి తెలిసిందే. రాజేంద్ర ప్రసాద్ అంచనాలకు అనుగుణంగానే ఈ సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. శని, ఆదివారం బుకింగ్స్ బాగుండటంతో ఈ సినిమా సులభంగానే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు సీనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కాగా ఎన్టీఆర్ ఘాట్ దగ్గర రాజేంద్ర ప్రసాద్ నివాళులు అర్పించారు. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సీనియర్ ఎన్టీఅర్ ద్వారా తాను మద్రాస్ ఫిల్మ్ స్కూల్ లో చేరానని తెలిపారు.
సీనియర్ ఎన్టీఆర్ పెట్టిన భిక్ష వల్లే తాను ప్రస్తుతం ప్రఖ్యాత నటుడిగా మీ ముందు ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు. మనతో ఉన్న పదిమందికి సహాయం చేయడమే ఆయనకు మనం ఇచ్చే ఘన నివాళి అని రాజేంద్ర ప్రసాద్ కామెంట్లు చేశారు. కొన్నేళ్లుగా ఆయన పక్కన ఉన్న వ్యక్తిని తానని రాజేంద్ర ప్రసాద్ కామెంట్లు చేశారు. సీనియర్ ఎన్టీఆర్ సమాజమే దేవాలయం అన్న విధంగా బ్రతికిన మనిషి అని రాజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.
సీనియర్ ఎన్టీఆర్ జీవించే ఉంటే ఆయనకు బంగారు పూలతో తాను పాదపూజ చేసేవాడినని రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. సీనియర్ ఎన్టీఆర్ ఎక్కడ ఉన్నా ఆయన ఆశీస్సులు మనపై ఉంటాయని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. రాజేంద్ర ప్రసాద్ కు వరుసగా సినిమా ఆఫర్లు వస్తుండగా తన నటనతో ఆయన మెప్పిస్తున్నారు.
త్రివిక్రమ్, అనిల్ రావిపూడి, మరి కొందరు డైరెక్టర్లు తమ సినిమాలలో రాజేంద్ర ప్రసాద్ కు ఎక్కువగా ఆఫర్లను ఇస్తున్నారు. ఎఫ్3 సినిమా సక్సెస్ తో అనిల్ రావిపూడి డబుల్ హ్యాట్రిక్ సాధించారు. ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కిన ఎఫ్3 సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.