Nithiin: మరోసారి పవన్ రిఫరెన్స్ వాడుకుంటున్న నితిన్.!
- July 22, 2024 / 10:02 AM ISTByFilmy Focus
నితిన్ (Nithin) హిట్టు కొట్టి చాలా కాలం అయ్యింది. 2020 లో వచ్చిన ‘భీష్మ’ (Bheeshma) తర్వాత నితిన్ నుండి ‘చెక్’ (Check) ‘రంగ్ దే’ (Rang De) ‘మాచర్ల నియోజకవర్గం’ (Macherla Niyojakavargam) ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ (Extra Ordinary Man) వంటి సినిమాలు వచ్చాయి. ఇవన్నీ ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని మంచి లైనప్ సెట్ చేసుకున్నాడు నితిన్. ఈ క్రమంలో ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్లో దర్శకుడు వెంకీ కుడుములతో (Venky Kudumula) ‘రాబిన్ హుడ్’ (Robinhood) అనే సినిమా చేస్తున్నాడు.

అలాగే దిల్ రాజు (Dil Raju) బ్యానర్లో ‘తమ్ముడు’ (Thammudu) అనే సినిమా చేస్తున్నాడు. ‘వకీల్ సాబ్’ (Vakeel Saab) దర్శకుడు వేణు శ్రీరామ్ (Venu Sriram) దీనికి దర్శకుడు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ అయ్యింది.సప్తమి గౌడ (Sapthami Gowda) హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటి లయ (Laya) కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇదిలా ఉండగా.. నితిన్ కి పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వరుస ప్లాపుల్లో ఉన్నప్పుడు నితిన్ కి అండగా నిలబడింది పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి.

పవన్ సపోర్ట్ ఉండటంతో అతని అభిమానులు కూడా నితిన్ కి అండగా నిలబడ్డారు. వాస్తవానికి కెరీర్ ప్రారంభం నుండి నితిన్ .. పవన్ రిఫరెన్సులు వాడుకుంటూనే ఉన్నాడు. సినిమాలో ఎక్కడో ఒక చోట పోస్టర్, టీవీలో క్లిప్పింగ్ ఇలా నితిన్ నటించే ప్రతి సినిమాలో పవన్ రిఫరెన్స్ కనిపిస్తుంది. ఇక అతని తమ్ముడు సినిమాలో కూడా ‘వయ్యారి భామ నీ హంస నడక’ అనే సాంగ్ ని రీమిక్స్ చేస్తున్నారట. సినిమాకి ఈ పాట హైలెట్ గా నిలుస్తుంది అని సమాచారం

















