‘‘ఓ బేబి’’ ఫేం తేజ సజ్జ హీరోగా మహతేజ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 కొత్త మూవీ!

మహతేజ క్రియేషన్స్ బ్యానర్ పై చంద్ర శేఖర్ మొగుల్ల ఎస్.ఒరిజినల్స్ సృజన్ యరబోలు కలిసి నిర్మిస్తున్న మూవీ నుండి హీరో తేజ లుక్ రిలీజైంది. ఈ రోజు తేజ పుట్టిన రోజు సందర్భంగా సినిమా నుండి అతని లుక్ ను రివీల్ చేసారు మేకర్స్. శివానీ రాజశేఖర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ను మల్లిక్ రామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఫాంటసీ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ: ‘‘మా మహతేజ క్రియేషన్స్ బ్యానర్ మీద ‘‘ఎస్ ఒరిజనల్స్’’ తో కలిసి ప్రొడక్షన్ నెంబర్ 1 గా ఈ సినిమా నిర్మిస్తున్నాం. ఫాంటసీ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ కథ అంతా జరుగుతుంది. డైరెక్టర్ మల్లిక్ రామ్ చెప్పిన కథకు అందరం కనెక్ట్ అయ్యాం..ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించాం. మూవీ చాలా బాగా వచ్చింది. తేజ,శివానీ రాజశేఖర్ ఇందులో లీడ్ రోల్స్ చేశారు..షూటింగ్ అంతా కంప్లీట్ అయింది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.ప్రస్తుత పరిస్థితులు చక్కబడిన తర్వాత మూవీని రిలీజ్ చేస్తాం’’ అన్నారు.
Most Recommended Video

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
IMDB రేటింగ్స్ ప్రకారం టాప్ 25 టాలీవుడ్ మూవీస్ ఇవే…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus