మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి అనేక మలుపులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ చాలా రోజుల క్రితమే ప్యానల్ ను ప్రకటించగా మంచు విష్ణు తాజాగా ప్యానల్ ను ప్రకటించారు. అయితే ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ జీవితపై చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల ఆఫీసర్ కు ఫిర్యాదు చేయడం గమనార్హం. తనకు ఓటు వేస్తే లాభాలు అంటూ జీవిత కొంతమందిని మభ్యపెడుతున్నారని పృథ్వీరాజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల ఆఫీసర్ నిబంధనల ప్రకారం జీవితపై చర్యలు తీసుకోవాలని పృథ్వీరాజ్ లేఖలో కోరారు.
జీవిత ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి పోటీ చేస్తుండగా పృథ్వీరాజ్ విష్ణు ప్యానల్ నుంచి వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ పడుతున్నారు. జీవితకు పోటీగా ఇండిపెండెంట్ గా బండ్ల గణేష్ పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. సాధారణ ఎన్నికలను తలపించేలా మా ఎన్నికలు జరుగుతుండటం గమనార్హం. అక్టోబర్ 10వ తేదీన మా ఎన్నికలు జరుగుతుండగా ఆరోజున ఏం జరగబోతుందో ఎవరికి అనుకూలంగా ఫలితాలు వస్తాయో చూడాల్సి ఉంది.
ప్రకాష్ రాజ్, విష్ణు ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా విజయం సాధించాలని తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలక్షన్ సమయానికి ఇంకెన్ని ట్విస్టులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. 900 మంది సభ్యులు ఉన్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో 500 కంటే తక్కువ మంది ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం. నాగబాబు ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇస్తుండగా సీనియర్ నరేష్ విష్ణుకు మద్దతు ఇస్తున్నారు.