సినిమా పాటల రచనలో ఆయనొక ప్రత్యేకం. ఆయన పాటలో శ్రోతలు మమేకం అయ్యారు. మాటలని మెచ్చారు. పదాలని పెదాలతో పలికారు. అలాంటి వెన్నెలకంటి ఇక తిరిగిరాని లోకాలకి వెళ్లిపోయారని కన్నీటి పర్యంతం అయ్యారు. 63 సంవత్సరాల వెన్నెలకంటి కి కన్నీటి వీడ్కోలు పలికారు. గుండెపోటుతో వెన్నెలకంటి మంగళవారం సాయంత్రం 4 గంటలకి కన్నుమూసిన విషయం తెలిసిందే. చెన్నైలోని ఉన్న తన నివాసమైన సాలి గ్రామంలో బుధవారం అంత్యక్రియలు జరిగాయి.
పలువురు సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెన్నెలకంటి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఎస్పీ చరణ్, ఎడిటర్ మోహన్ వెన్నెలకంటికి కడసారి వీడ్కోలు పలికారు. తెలుగు చలనచిత్రరంగంలో వెన్నెలకంటి ఒక ప్రత్యేకమైన మార్క్ వేశారని, తనదైన స్టైల్లో పాటలు రాశారని చెప్పారు. ఇప్పటితరం కూడా మెచ్చే పాటలు రాయడం అయనకే చెల్లిందని అభిప్రాయపడ్డారు. గజిని సినిమాలో హృదయం ఎక్కడున్నదీ పాట ఇప్పటికీ అందరి హృదయాల్లో నిలిచిపోయింది.
రాజేంద్రప్రసాద్ యాక్ట్ చేసిన బృందావనం సినిమాలో వెన్నెలకంటి రాసిన పాటలు అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయ్యాయి. అంతేకాదు, ఈ లిరిక్స్ ని ఎంతోమంది మెచ్చుకున్నారు కూడ. అలాంటి వెన్నెలకంటి లేకపోవడం తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటు.