‘పుష్ప: ది రూల్’ (Pushpa 2: The Rule) సినిమా ప్రత్యేకతల్లో భాగంగా మొన్నీమధ్య వరకు త్రీడీ వెర్షన్‌ను కూడా చెప్పింది టీమ్. అయితే అనూహ్యంగా త్రీడీ వెర్షన్ ఆలోచనను విరమించుకుంది. పూర్తిగా తీసుకురావడం లేదా? లేక కొన్ని రోజుల తర్వాత తీసుకొస్తారా అనేది తెలియడం లేదు కానీ.. ప్రస్తుతానికి అయితే త్రీడీ ‘పుష్ప’రాజ్‌ను చూసే అవకాశం లేదు. అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా, సుకుమార్ (Sukumar) డైరక్షన్‌లో రూపొందిన సీక్వెల్ చిత్రం ‘పుష్ప: ది రూల్’. ప్రపంచవ్యాప్తంగా 12వేలకు పైగా స్క్రీన్‌లలో ఐమ్యాక్స్, డాల్బీ, డిబాక్స్, 4డీఎక్స్, ఐస్, 2డీ, 3డీ ఫార్మాట్‌లలో సినిమాను ఈ నెల 5న విడుదల చేస్తున్నారు.
Pushpa 2
కొన్ని చోట్లు డిసెంబరు 4న రాత్రి 9.30కే షోలు పడుతున్నాయి. అయితే 3D వెర్షన్‌కు సంబంధించిన పనులు పూర్తి కాకపోవడంతో ప్రస్తుతానికి 2డీ వెర్షన్‌ను మాత్రమే అందుబాటులోకి తెస్తున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ సినిమా విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ చెపపారు. ఆయన త్రీడీ వెర్షన్‌లో చూద్దామని టికెట్స్ బుక్ చేసుకుంటే, షో క్యాన్సిల్ చేశారు అని చెప్పారట. దానికితోడు హైదరాబాద్‌లో ఇప్పటివరకు త్రీడీ వెర్షన్ సినిమా ఇంకా బుకింగ్స్ లిస్ట్‌లో కనిపించడం లేదు.
దీంతో ఇక ఆ వెర్షన్ ఇప్పుడు రానట్లే అని చెబుతున్నారు. చిత్రబృందం నుండి వస్తున్న సమాచారం ప్రకారం అయితే ఇప్పటికే 2డీ వెర్షన్ రెడీ అయిందని, థియేటర్ వెర్షన్‌ను ఒకటికి రెండుసార్లు వేసి చూసుకుంటున్నారట. మార్పుచేర్పులు చేసుకుంటున్నారు కూడా. దీంతో ఇప్పుడు త్రీడీ వెర్షన్ కోసం చూస్తే పని నాణ్యత బాగుండదు అని అనుకుని ఆగిపోయారట.
ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు కోర్టుల్లో రెండు కేసులు పడగా.. ఒకటి వాయిదా పడింది, మరొకటి కొట్టివేశారు. టికెట్ ధరల విషయంలో పడిన పిటిషన్‌ను ఈ నెల 17కు వాయిదా వేశారు. ఇక స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా అంటూ పడిన కేసును కోర్టు కొట్టివేసింది. దీంతో ఆ విధంగా సినిమా విడుదలకు వచ్చిన రెండు సమస్యలు ప్రస్తుతానికి లేవు.