దర్శకరత్న దాసరి నారాయణరావు ఉన్నంతకాలం ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరించేవారు. సినీ పరిశ్రమలో ఎలాంటి సమస్యనైనా.. ఆయనే పరిష్కరించేవారు. అలాంటి వ్యక్తి మరణించిన తరువాత ఇండస్ట్రీ పెద్దగా ఎవరు వ్యవహరిస్తారనే ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ స్థానం మెగాస్టార్ చిరంజీవిదే అని కొందరు.. దాసరి లేని లోటుని ఎవరూ తీర్చలేరని మరికొందరు అంటున్నారు. ఇంకొందరైతే ఆ హక్కు మంచు ఫ్యామిలీకే ఉందని అంటున్నారు. దీనిపై స్పందించిన దర్శకుడు రాఘవేంద్రరావు..
‘అసలు సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కే అవసరం లేదని’ తేల్చి చెప్పారు. ఇక్కడ ఎవరు ఎవరి మాటా వినరని .. అలాంటప్పుడు సలహాలు ఇవ్వడం ఎందుకని అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ”నా జీవితంలో రెండే రెండు కోరికలున్నాయి. ఒకటి అజాత శత్రువు అనిపించుకోవాలి. రెండోది ఎవరికీ ఎలాంటి సలహాలు ఇవ్వకూడదు. ఇండస్ట్రీ నన్ను చాలా గౌరవించింది. ఈతరం దర్శకులు సైతం నన్ను అభిమానిస్తున్నారు. ఇప్పుడు వాళ్ల మధ్య పెద్దరికం చూపించాల్సిన అవసరం ఏమొచ్చింది” అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరితో రాఘవేంద్రరావుకి మంచి రిలేషన్ ఉంది. చిరంజీవి, మోహన్ బాబులతో ఆయనకు స్పెషల్ బాండింగ్ ఉంది. అందుకే ఆయన ఈ రెండు వర్గాల్లో ఎవరికీ సపోర్ట్ చేయకుండా సైలెంట్ గా తప్పించేసుకున్నారు.