Ram Charan: తండ్రి వారసత్వం ఇందులో కూడా తీసుకుంటాడా?

చిత్రపరిశ్రమలో మరో మంచి సంప్రదాయం కొనసాగబోతోందా? అవుననే అంటున్నాయి మెగా ఫ్యామిలీ వర్గాలు. 80ల కాలం నాటి హీరోలు, హీరోయిన్లు కలసి ఓ టీమ్‌ ఏర్పాటు చేసుకున్నారు గుర్తుందా? చిరంజీవి ఆధ్వర్యంలో ఈ టీమ్‌ ఏటా వివిధ థీమ్స్‌లో గ్యాథరింగ్స్ ఏర్పాటు చేస్తుంటారు. అందరూ ఒక రోజు కలసి సరదాగా గడుపుతారు. ఇప్పుడు అదే సంప్రదాయాన్ని రామ్‌చరణ్‌ తీసుకొస్తాడని టాక్‌. 2K క్లబ్‌ పేరుతో ఈ టీమ్‌ ఉంటుందని టాక్‌.

2000- 2010 మధ్యలో టాలీవుడ్‌లోకి ప్రవేశించిన కథానాయకులు, కథానాయికలు అందరినీ ఓ గ్రూపుగా చేసి ఓ క్లబ్‌ను ఏర్పాటు చేయాలని రామ్‌చరణ్‌ భావిస్తున్నాడట. 80`s క్లబ్‌ తరహాలోనే ఏటా గ్యాథరింగ్‌ ఏర్పాటు చేసి అందరూ కలవాలని నిర్ణయించుకున్నారట. ఇది ఇప్పటికే మొదలవ్వాల్సి ఉన్నా కరోనా కారణంగా ఆలస్యమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారికంగా రామ్‌చరణ్‌ టీమ్‌ ప్రకటిస్తుందని టాక్‌. మరి అందులో ఎవరెవరు ఉంటారనేది అప్పుడు తెలుస్తుంది. 80`s క్లబ్‌లో టాలీవుడ్‌లో కేవలం టాలీవుడ్‌ నుండే కాకుండా బాలీవుడ్‌, కోలీవుడ్‌, మాలీవుడ్‌, శాండిల్‌వుడ్‌ నుండి హీరోలు, హీరోయిన్లు ఉన్నారు.

2K క్లబ్‌లో కూడా అలానే చేస్తారని టాక్‌. అంతేకాదు దీని ద్వారా కొంత డబ్బు సేకరించి స్వచ్ఛంధ సంస్థలకు ఇస్తారనే టాక్‌ కూడా వినిపిస్తుంది. 80`s మీటింగ్‌ అంటేనే జోష్‌ ఉన్న పాటలు, స్టెప్పులు, వావ్‌ మూమెంట్స్‌ కనిపిస్తాయి. దీంతో అప్పటి తరం అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోతారు. మరి 2K టీమ్‌ ఏం చేస్తుందో.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus