శింబుయే కాదు, శింబు అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న విజయం ‘మానాడు’ ఇచ్చింది. అయితే ఈ ఆనందం కేవలం తమిళ అభిమానులకు మాత్రమే. ఎందుకంటే ఈ సినిమా తెలుగు వెర్షన్ ‘లూప్’ మన దగ్గర విడుదలవ్వలేదు. సినిమాకు భారీ స్థాయిలో ప్రచారం చేసి మరీ ఎందుకు రిలీజ్ ఆపేశారు అనే డౌట్ మీకు వచ్చిందా? అయితే దానికి సమాధానం దొరికేసింది. సినిమాను తెలుగులో రీమేక్ చేద్దామని చూస్తున్నారని లేటెస్ట్ టాక్.
‘మానాడు’లో శింబు అదరగొట్టేశాడు అందులో ఎలాంటి డౌట్ లేదు. అలాగే ఎస్.జె.సూర్య కూడా వావ్ అనిపించాడు. అయ్యో భలే సినిమా మిస్ అయ్యామే అని తెలుగు వారు అనుకుంటున్నారు. దానికి తోడు సినిమాలో ఎస్.జె.సూర్య పాత్ర తొలుత రవితేజ చేయాల్సింది అనే విషయం తెలిసేసరికి ఇంకా ఎగ్జైట్ అవుతున్నారు. సినిమా కాన్సెప్ట్, ఎలివేషన్లు అలా ఉన్నాయి మరి. ఇప్పుడు తెలుగులో రీమేక్ కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇక్కడ ఎవరెవరు నటిస్తారు, దర్శకుడు ఎవరు లాంటి విషయాల మీదే ఇంకా క్లారిటీ రాలేదు.
అయితే తెలుగు రీమేక్ మాత్రం పక్కా అని సమాచారం. టైమ్ లూప్ అనే కాన్సెప్ట్‌ను, వినోదాత్మకంగా చూపించగలిగే దర్శకులు ఇప్పుడు మన దగ్గర చాలామంది ఉన్నారు. అయితే అందులో ఎవరు అనేది చూడాలి. లేకపోతే వెంకట్ ప్రభునే హ్యాండిల్ చేస్తారేమో చూడాలి. ఇదే జరిగితే రవితేజ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. మాటేంటి అనుకుంటున్నారా. ‘మానాడు’లో ఎస్.జె.సూర్య చేసిన పాత్రను మిస్ చేసుకున్నప్పుడు రవితేజ… ఓ మాట అన్నారట.
ఈ సినిమా తెలుగు రీమేక్ అయితే నేను తప్పక నటిస్తాను అని. మరిప్పుడు రవితేజ ఏం చేస్తారో చూడాలి. అన్నట్లు ఈ సినిమా తెలుగు మాత్రమే కాకుండా ఇతర భాషల్లోకి కూడా వెళ్తుందని టాక్. శింబు సినిమాకు ఇలాంటి న్యూస్ రావడం ఫ్యాన్స్‌కి హ్యాపీనే కదా.