మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ చిత్రం మే 12న విడుదలైంది. పరశురామ్(బుజ్జి) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’, ’14 రీల్స్ ప్లస్’, ‘జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్’ సంస్థలు కలిసి నిర్మించాయి. మొదటి షోతోనే ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ మొదటి వీకెండ్ ను ఈ మూవీ బాగానే క్యాష్ చేసుకుంది.కాకపోతే నైజాంలో టికెట్ రేట్లు ఎక్కువగా ఉండడం వల్ల చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పడటం లేదు.
నిన్న 5 వ రోజున మొదటి సోమవారం నాడు ఈ మూవీకి చాలా డ్రాప్స్ కనిపించాయి. అయినప్పటికీ డీసెంట్ అనిపించింది. ఆంధ్రాలో ఈ మూవీ పర్వాలేదు అనిపిస్తుంది. వీక్ డేస్ లో ఇలాగే స్టడీగా రాణిస్తే బ్రేక్ ఈవెన్ ఛాన్స్ లు ఉంటాయి. ‘సర్కారు వారి పాట’ 5 డేస్ కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే :
నైజాం
29.04 cr
సీడెడ్
9.90 cr
ఉత్తరాంధ్ర
9.92 cr
ఈస్ట్
6.89 cr
వెస్ట్
4.39 cr
గుంటూరు
7.82 cr
కృష్ణా
5.20 cr
నెల్లూరు
3.08 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
76.24 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
5.38 cr
ఓవర్సీస్
11.20 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
92.82 cr
‘సర్కారు వారి పాట’ చిత్రానికి రూ.120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.121 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.92.82 కోట్ల షేర్ ను రాబట్టింది. సోమవారం నాడు చాలా వరకు డ్రాప్స్ కనిపించినా పర్వాలేదు అనిపించింది.అయితే బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ ఇంకా రూ.28.18 కోట్ల షేర్ ను రాబట్టాలి. అది ఈజీ టార్గెట్ అయితే కాదు.
ఈ వీక్ అంతా ఇలా స్టడీ గా రాణించి.. నెక్స్ట్ వీకెండ్ కు గ్రోత్ ను చూపిస్తే కానీ ఆ టార్గెట్ రీచ్ అవ్వడం కష్టం. అన్నిటికీ మించి టికెట్ రేట్లు తగ్గించాలి.. లేదంటే సమ్మర్ సీజన్ మిస్ అయిపోయే ప్రమాదం ఉంది.