చిరంజీవి హీరోగా మోహన్ రాజా డైరెక్షన్ లో తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ రిలీజ్ కు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో సత్యదేవ్ నటించారు. ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని సత్యదేవ్ కు ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ దక్కుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సత్యదేవ్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
చిరంజీవి అన్నయ్య నుంచి ఒకరోజు లంచ్ కు నాకు పిలుపు వచ్చిందని ఆ సమయంలో అన్నయ్య నాకు గాడ్ ఫాదర్ కథ చెప్పారని ఆయన కథ చెబుతుంటే నేను షాకింగ్ గా చూస్తున్నానని సత్యదేవ్ అన్నారు. అన్నయ్య నాకు సినిమా కథ చెబుతారని నేను కలలో కూడా ఊహించలేదని చిరంజీవి అన్నయ్య కథ చెబుతుంటే నేను ఆశ్చర్యంతో చూస్తున్నానని సత్యదేవ్ కామెంట్లు చేయడం గమనార్హం. మెగాస్టార్ చిరంజీవిని నేను గురువులా భావిస్తానని నేను ఆశ్చర్యంగా చూస్తుండటంతో
అన్నయ్య నేను కథ చెప్పకుండా డైరెక్టర్ మోహన్ రాజాతో కథ చెప్పించనా అని అడిగారని సత్యదేవ్ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో నాకేం అర్థం కావడం లేదు అన్నయ్యా అని నేను సమాధానం ఇచ్చానని సత్యదేవ్ వెల్లడించారు. ఆ తర్వాత అన్నయ్య లూసిఫర్ చూశావా అని అడిగారని నేను లూసిఫర్ మూవీ చూడలేదని ఇకపై కూడా చూడనని చెప్పానని వెల్లడించారు. సత్యదేవ్ కు గాడ్ ఫాదర్ సినిమా నటుడిగా మంచి పేరును తెచ్చిపెట్టడం గ్యారంటీ అని మరి కొందరు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.
భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా వరీనా హుస్సేన్ ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశారని సమాచారం. ఈ స్పెషల్ సాంగ్ కోసం మేకర్స్ ఏకంగా కోటిన్నర రూపాయలు ఖర్చు చేశారని తెలుస్తోంది. గాడ్ ఫాదర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.