‘రాజావారు రాణి గారు’, ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ వంటి విజయవంతమైన చిత్రాలతో యువతకి చేరువైన కిరణ్ ఆబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ ‘సెబాస్టియన్ PC 524’. రేచీకటి తో బాధపడే పోలీస్ ఆఫీసర్, అతను ఎదుర్కొన్న వింత పరిస్థితులు నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. పాయింట్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నా కథనం ఆసక్తిగా లేకపోవడంతో సినిమాకి ఫ్లాప్ టాక్ నమోదయ్యింది.దాంతో ఓపెనింగ్స్ కూడా దారుణంగా నమోదయ్యాయి. ‘ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్’ సమర్పణలో ‘జ్యోవిత సినిమాస్’ బ్యానర్ పై బి . సిద్దారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.
జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.బాలాజీ సయ్యపురెడ్డి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను గమనిస్తే:
నైజాం
0.23 cr
సీడెడ్
0.15 cr
ఉత్తరాంధ్ర
0.12 cr
ఈస్ట్
0.06 cr
వెస్ట్
0.04 cr
గుంటూరు
0.09 cr
కృష్ణా
0.06 cr
నెల్లూరు
0.03 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
0.78 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్
0.04 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
0.82 cr
‘సెబాస్టియన్ PC 524’ చిత్రానికి రూ.6.45 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు రూ.7 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం రూ.0.82 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో రూ.6.18 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఇంత డిజాస్టరస్ ఓపెనింగ్స్ తో ఆ టార్గెట్ ను రీచ్ అవ్వడం చాలా కష్టమనే చెప్పాలి.