టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరిచూపు RRR పైనే ఉంది. బహుబలి సినిమాతో బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలకు ఒక దారి చూపించిన దర్శకధీరుడు ఇప్పుడు అదే తరహాలో RRR సినిమాను కూడా రెడీ చేస్తున్నాడు. మొత్తానికి సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ పై ఒక క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. దసరా సందర్భంగా అక్టోబర్ 13న విడుదల కానున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశారు. అయితే సినిమా బిజినెస్ లెక్కలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
డీలింగ్స్ చాలా వరకు క్లోజ్ అయినట్లు టాక్ వస్తోంది. ఇక ఓవర్సీస్ రైట్స్ పై కూడా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. తెలుగు తమిళ్ రైట్స్ ను ఒక్కరికే అమ్మబోతున్నారట. మొదట 55కోట్లకు అనుకోగా ఆ తరువాత పెరుగుతున్న డిమాండ్ మేరకు తెలుగు తమిళ్ ఓవర్సీస్ హక్కులను 68కోట్లకు ఫిక్స్ చేసినట్లు రూమర్స్ వస్తున్నాయి. ఈ సారి రాజమౌళి సినిమా ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా పాత రికార్డులను బ్రేక్ చేయగలదని నమ్మకంతో ఉన్నారు.
అందుకే ఓవర్సీస్ రైట్స్ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదట. మరి RRR సినిమా పాత రికార్డులను ఏ స్థాయిలో బ్రేక్ చేస్తుందో చూడాలి. ఇక రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మిగిలిన కొన్న ఏరియాల బిజినెస్ డీలింగ్స్ కూడా క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.