‘అజ్ఞాతవాసి’ చిత్రం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండీ మరో సినిమా రాలేదు. ఎన్నికలు రావడం, ఆ తరువాత ఆయన తన ‘జనసేన’ పార్టీని బలోపేతం చెయ్యడానికి ప్రయత్నించడంతో రెండేళ్ల పాటు ఆయన సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఎట్టకేలకు ఆయన తిరిగి సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చెయ్యబోతున్నారు అని ప్రకటించిన తరుణంలో కరోనా మహమ్మారి హడావిడి మొదలైంది. 2020 సమ్మర్ కు అంటే మే 15కి విడుదల కావాల్సిన ‘వకీల్ సాబ్’ చిత్రం విడుదల కాలేదు.
ఇక థియేటర్లు కూడా 9నెలల పాటు తెరుచుకోకపోవడంతో ‘వకీల్ సాబ్’ విడుదల గురించి పవన్ అభిమానులు పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు మెల్ల మెల్లగా థియేటర్లు ఓపెన్ అవుతున్నాయి. దాంతో పవర్ స్టార్ అభిమానులు ‘వకీల్ సాబ్’ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదల సంగతి అటు ఉంచితే… 80 శాతం షూటింగ్ కంప్లీట్ అయినా.. ఇంకా దర్శక నిర్మాతలు టీజర్ని కూడా విడుదల చెయ్యలేదు. ఇలాంటి టైములో ‘ ‘వకీల్ సాబ్’ చిత్రం 2021 సంక్రాంతి కానుకగా విడుదలవుతుంది’ అంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
అయితే తాజా సమాచారం ప్రకారం.. ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు ఏప్రిల్ 9న విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారట. ఒకవేళ అప్పటికీ కుదరకపోతే మే లోనే విడుదల చెయ్యాలని భావిస్తున్నారట. అప్పటికి వ్యాక్సిన్ అదీ వచ్చి.. జనాల్లో కరోనా భయం పోతుంది అని ‘వకీల్ సాబ్’ టీం భావిస్తున్నట్టు సమాచారం. ఎలా చూసుకున్నా.. ‘వకీల్ సాబ్’ చిత్రం ముందుగా అనుకున్న టైం కంటే ఏడాది లేట్ గా విడుదలకబోతుందన్న మాట..!