బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం రేస్ టు ఫినాలే టాస్క్ నడుస్తోంది. ఇందులో లెవల్ వన్ లో గార్డెన్ ఏరియాలో ఉన్న ఆవునుంచి పాలని కలక్ట్ చేసి నింపుకుని సీసాల్లోకి వాటిని నింపాలి. ఎవరికి ఎక్కువ సీసాలు ఉంటాయో వారు విజేత. ఇక్కడ మూడుసార్లు బజర్ మోగినప్పుడు బాటిల్స్ కౌంట్ చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడే స్మార్ట్ గేమ్ ఆడాలి. అప్పుడే లెవల్ టు లోకి వెళ్తాం. హారిక అండ్ అభిజిత్ ఇద్దరూ కూడా సైలెంట్ గా పాలని నింపుకుంటూ సీసాల్లోకి వాటిని కలక్ట్ చేశారు. అంతేకాదు, ఇద్దరూ అండర్ స్టాండింగ్ తో గేమ్ ఆడితే, వైలంట్ గా అఖిల్ అండ్ సోహైల్ ఇద్దరూ గేమ్ ఆడి లెవల్ టు లోకి వచ్చారు.
ముందుగా ఫస్ట్ రౌండ్ లో అవినాష్ తో జరిగిన లొల్లిలో సోహైల్ గేమ్ ని రూడ్ గా ఆడాడు. అలాగే, అవినాష్ నేను ఇంక ఆడను అంటూ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. అంతేకాదు, దొంగతనంగా పాలల్లో నీళ్లు కలిపి ఒక స్మార్ట్ ట్రిక్ ని ప్లేచేసే ప్రయత్నం కూడా చేశాడు కానీ అది కాస్త బెడిసికొట్టింది. అందుకే, ఫస్ట్ అవినాష్ అవుట్ అయ్యాడు. నిజానికి అవినాష్ తో కాస్త రూడ్ గా ప్రవర్తించిన సోహైల్ తర్వాత అవినాష్ ని చాలాసేపు బ్రతిమిలాడాడు. గేమ్ ని గేమ్ లా చూడు.. మళ్లీ ఆడు రా అంటూ అడిగాడు. కానీ అవినాష్ రాలేదు. గేమ్ ఆడలేదు.
మరోవైపు అఖిల్ అండ్ సోహైల్ ఇద్దరూ కూడా జట్టుగా ఆడి లెవల్ టులోకి వెళ్లారు. వీరిద్దరూ వైలెంట్ గా గేమ్ ని ఆడుతుంటే, సైలంట్ గా హారిక తనపని తాను చేసుకుంటూ వెళ్లిపోయింది. అలాగే, అభిజిత్ కూడా లాస్ట్ రౌండ్ వచ్చేసరికి ఎక్కువబాటిల్స్ లో పాలని నింపుకున్నాడు. సేఫ్ జోన్ గానే గేమ్ ఆడాడు. హారిక నింపుకున్న బాటిల్స్ ని వేరేవాళ్లు కౌంట్ చేయకుండా సైడ్ కి దాచుకుంది. అలాగే, ఎవరికివారే పాల బాటిల్స్ ని దాచుకునే ప్రయత్నం కూడా చేశారు. ఫైనల్ గా హారిక – అభిజిత్ అలాగే సోహైల్ – అఖిల్ లెవల్ టు కి వెళ్లారు. మరి వీళ్లలో ఫినాలే టిక్కెట్ ని ఎవరు సంపాదించుకుంటారు అనేది ఆసక్తికరం. అదీ మేటర్.