సుకుమార్ ప్లాన్ ఇదే..!

టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు సుకుమార్. ఓ పక్క దర్శకుడిగా సినిమాలు చేస్తూనే సొంతంగా బ్యానర్ మొదలుపెట్టి నిర్మాతగా మారాడు. సుకుమార్ రైటింగ్స్ పేరుతో సినిమాలు నిర్మించడం ప్రారంభించాడు. గతంలో ఆయన నిర్మించిన ‘కుమారి 21 ఎఫ్’ సినిమా మంచి సక్సెస్ ను అందుకుంది. రీసెంట్ గా విడుదలైన ‘ఉప్పెన’ సినిమా కూడా నిర్మాతగా భారీ విజయాన్ని తీసుకొచ్చింది. ‘ఉప్పెన’ హిట్టులో సగం క్రెడిట్ సుకుమార్ కి చెందుతుంది. ఇప్పుడు నిర్మాతగా మరో ప్రయత్నం చేస్తున్నాడు.

కార్తికేయతో సుకుమార్ రైటింగ్స్ లో ఓ సినిమాకి సంబంధించిన ప్రకటన వచ్చింది. సెప్టెంబర్ లో ఈ సినిమా పట్టాలెక్కనుంది. డైరెక్టర్ ఎవరనేది చెప్పలేదు కానీ సుకుమార్ శిష్యుల్లో ఒకరు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అన్నీ కూడా సుకుమార్ అందించనున్నారు. అయితే ఇప్పటివరకు సుకుమార్ దగ్గర ఈ సినిమాకి కావాల్సిన కథ లేదట. కేవలం హీరోని ఎంపిక చేసి పెట్టుకున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ ప్లాన్ ఏంటంటే.. ‘ఉప్పెన’ మాదిరి ఈ సినిమాపై కూడా ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా.. కేవలం నిర్మాతగా తన పేరు కనిపించేలా చూస్తున్నాడు.

ఎప్పుడైతే ఈ సినిమా ప్రకటన వచ్చిందో.. అప్పటినుండి చాలా మంది నిర్మాతలు సుకుమార్ కి ఫోన్ చేసి సినిమాపై పెట్టుబడి పెడతామంటూ ముందుకొస్తున్నారట. ఆ విధంగా బయట వాళ్లతో పెట్టుబడి పెట్టించి.. తన పేరు వాడుకొని లాభాల్లో వాటాలు తీసుకుంటాడు సుకుమార్. ‘ఉప్పెన’ సినిమా విషయంలో కూడా ఇలానే చేశారు. ఈసారి కూడా అదే ఫాలో అవ్వబోతున్నారు. గతంలో మారుతి లాంటి దర్శకులు ఇలానే చేశారు. ఇప్పుడు సుకుమార్ కూడా తన బ్రాండ్ ని వాడుకొని డబ్బు సంపాదించబోతున్నారు.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus