తమిళ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు సిలంబరసన్ (శింబు) (Silambarasan) ఇప్పుడు జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించే పాత్ర కోసం సిద్ధమవుతున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ (Virat Kohli) బయోపిక్‌లో శింబు నటించనున్నాడని పుకార్లు షికారు చేస్తున్నాయి. కోహ్లీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శింబు నటించిన ‘పాతా థాలా’ చిత్రంలోని ‘నీ సింగం ధన్’ పాట తనకు ఇష్టమైన సాంగ్ అని చెప్పడం, దానిని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సోషల్ మీడియాలో షేర్ చేయడం, శింబు దానికి స్పందిస్తూ కృతజ్ఞతతో రీపోస్ట్ చేయడం ఈ వార్తలకు ఊతమిచ్చాయి.
శింబు ఇప్పటికే తమిళ సినిమాల్లో తన నటనతో మంచి గుర్తింపు పొందాడు. ప్రస్తుతం మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వంలో ‘థగ్ లైఫ్’(Thug Life), అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ‘STR 51’ వంటి ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. అయినప్పటికీ, కోహ్లీ బయోపిక్ లాంటి భారీ అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా అని శింబు ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీ (Virat Kohli) లాంటి జాతీయ స్థాయి స్టార్ బయోపిక్‌లో నటిస్తే, శింబు కెరీర్ మరో స్థాయికి చేరడమే కాక, తమిళ సినిమా ఇండస్ట్రీకి కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందని అభిమానులు భావిస్తున్నారు.
కోహ్లీ బయోపిక్ అనేది కేవలం ఒక క్రికెటర్ జీవిత కథ మాత్రమే కాదు, భారత క్రికెట్‌లో ఓ యుగాన్ని నడిపిన స్టార్ జర్నీ. ఇలాంటి పాత్రలో శింబు నటిస్తే అతని నటనా ప్రతిభ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. శింబు ఇప్పటికే తన ఫిజిక్‌ను మార్చుకుని, కోహ్లీ లాంటి లుక్‌లో కనిపిస్తున్నాడని, ఈ బయోపిక్ కోసం సన్నాహాలు చేస్తున్నాడని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా తెరకెక్కితే, ఇది శింబు కెరీర్‌లో ఒక బిగ్ రికార్డ్ గా నిలిచే అవకాశం ఉంది.
సోషల్ మీడియాలో ఈ వార్తలు వైరల్ కావడంతో, కోహ్లీ బయోపిక్‌కి సంబంధించి అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కోహ్లీ బయోపిక్ ద్వారా శింబు జాతీయ స్థాయి నటుడిగా ఎదిగితే, తమిళ సినిమా రేంజ్ కూడా పెరుగుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం శింబు బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ, ఈ ప్రాజెక్ట్ నిజమైతే అతని కెరీర్‌లో కొత్త అధ్యాయం మొదలవుతుందని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొంత కాలం ఆగాల్సిందే.