హోలీ అంటే రంగుల్లో మునిగి తేలడం. ఒకరికి ఒకరు ముఖానికి రంగులు పూసుకుంటూ….రంగుల నీళ్ళలో తడిసి ముద్ద అవుతూ ఆనందంగా జరుపుకునే ఆహ్లాదకరమైన పండుగ. అంతేకాదు ఇదే పండుగలో కోడిగుడ్లతో కూడా కొట్టుకుంటూ ఆ పండుగను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తున్న సందర్భాలను కూడా మనం చూస్తూనే ఉంటాం. నిజానికి హోలీ రోజు నాడు వైట్ అండ్ వైట్ వేసుకుని రంగులు వేయించుకోవడం అనేది సమానత్వాన్ని, స్నేహాన్ని, ఆనందాన్ని సూచిస్తుంది.
మనిషి లోపల కపటం అనే రంగు తీసేసి నలుగురితో కలిసి హోలీని జరుపుకుంటే అది మనసును పవిత్ర పరుచుకున్నట్టు అని పెద్దలు చెబుతూ ఉంటారు. ‘హోలీ’ అంటే అర్థం పవిత్రమైనది అన్న సంగతి తెలిసిందే. సరే ఈ పండుగను సినిమాల్లో కూడా ఎక్కువగానే వాడుకున్న సందర్భాలు ఉన్నాయి.కొన్ని సినిమాల్లో హోలీ పండుగ కీలకమైన సన్నివేశాల్లో లేదా పాటల్లో కీలక పాత్ర పోషించింది.మరి ఆ సన్నివేశాలు, పాటలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
ముందుగా పాటలు :
1) మురారి : డుం డుం డుం నటరాజు ఆడాలి
2) నాయకుడు – సందెపొద్దు మేఘం
3) మహానగరంలో – హరివిల్లే వరమల్లె..ఇలపైకి
4) ఓం 3డీ – ఈ ప్రేమ గాల్లో తేలుతుంది..నా గుండె రంగుల్లో ఆడింది.
5) మాస్ – కొట్టు కొట్టు కొట్టు..రంగు తీసి కొట్టు
6) బంఫర్ ఆఫర్ – ఒలమ్మొ…ఒలామ్మో నీ కొంపె కొల్లెరమ్మొ
7) చక్రం – రంగేళీ హోలీ….అందామా కేళి
8) రాఖీ – రంగు రబ్బా రబ్బా…అంటుంది రంగు
9) శ్రీ – హోలీ హోలీ పండగల్లే..ఉత్సాహం ఏదో ఉప్పొంగుతూ ఉంది.
10) భలే భలే మగాడివోయ్ – మొట్టమొదటిసారి
11) కేరింత – కేరింత టైటిల్ సాంగ్
12) కిక్ 2 – నువ్వే నువ్వే
13) సీతారామరాజు : రంగోలి సాంగ్
14) ఝుమ్మంది నాదం : బాలామణి…బాలామణి
15)అల్లరి మొగుడు : రేపల్లె మళ్ళీ మురళి విన్నది
16) ది వారియర్ : కలర్స్
17) పడి పడి లేచె మనసు : ఓ మై లవ్లీ లలన
18) హోలీ: ఉదయ్ కిరణ్-రిచా
ఈ చిత్రంలో హోలీ పండుగ రోజున తన మదిలోని ప్రేమను తెలియజేస్తాడు మన హీరో, అయితే పెళ్ళికి ముందు ప్రేమ నచ్చదు అని, పెళ్లి చేసుకున్న తరువాత ప్రేమిస్తాను అని హీరోయిన్ చెబుతుంది. ఇక దానికి మన హీరోగారు పెళ్ళికి ముందు కొన్నాళ్ళు ప్రేమించుకుందాం అని, ఒకళ్ళకు ఒకరు అర్ధం చేసుకుని పెళ్ళిచేసుకుందాం అని చెబుతాడు. ఇలా ఆ కధ అనేక మలుపులు తిరిగి చివరకు వాళ్ళ ప్రేమను గెలిపించుకుంటారు.
19) దేవదాస్: రామ్-ఇలియాన
ఈ చిత్రంలో సైతం ప్రేమను గెలిపించుకుందుకు హీరో అమెరికాలో హోలీ ప్లాన్ చేస్తాడు. హీరోయిన్ ను ఎలా అయినా కలవాలి అన్న సాకుతో హోలీ రోజున హీరోయిన్ ను తన తండ్రి చేతనే బయటకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేసి కలుస్తాడు. చివరకు హీరోయిన్ తండ్రితో చివరి వరకూ యుద్దం చేసి తన ప్రేమను గెలిపించుకుంటాడు.
20) ఓయ్: సిద్దార్థ్-షామిలీ
ఈ సినిమాలో రిచ్ పర్సన్యాలిటీ అయినటువంటి హీరో, తనకు నచ్చిన షామిలీని ప్రేమించేందుకు అనేక పాట్లు పడుతూ ఉంటాడు. అందులో భాగంగానే షామిలీ కుటుంభంలో ఉన్న పిల్లలను తనకు సపోర్ట్ గా చేసుకునేందుకు హోలీ పండుగను ఎంపిక చేసుకుని రంగుల్లో మునిగి తేలతాడు. ఇక ఆ పద్దతి నచ్చని షామిలీ తన ఇంట్లో పిల్లల్ని తీసుకెళ్ళి పోయి, హీరోకి పెద్ద షాక్ ఇస్తుంది. అలా ఎన్నో ట్రైల్స్ వేస్తా హీరో చివరకు ప్రేమ కధను ముగిస్తాడు.
21) ఇంద్ర – చిరంజీవి
సీమలోని నీళ్ళ కష్టాల గురించి హీరోకు తెలిపేందుకు హోలీ పండుగను ఉపయోగించుకున్నాడు మన దర్శకుడు. ‘ఎంతో మంది తాగడానికి గుక్కెడు నీళ్ళు లేక ఆల్లాడి పోతుంటే, ఇక్కడ గుండిగలు…గుండిగలు నీళ్ళు వృద్దా చేస్తున్నారు’ అన్న పిలుపు విన్న హీరో సరికొత్త చరిత్రకు శ్రీకారం చూడతాడు.
22) పగ: జయం రవి – భావన
పగ సినిమాలో సైతం హీరో హీరోయిన్స్ మధ్య ప్రేమాను బంధాన్ని తెలియజేసే క్రమంలో హోలీ పండుగను వేదికగా చేసుకున్నాడు దర్శకుడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ను బెదిరించి మరీ ఆమెతో హోలీ అదే సీన్ ప్రేక్షకులకు పులకింత పెట్టిస్తుంది.
ఇలా రంగుల హోలీను తమదైన శైలిలో తెరకెక్కించి ప్రేక్షకులను సినీ రంగుల ప్రపంచంలో మునిగి తేల్చారు మన సినీ ప్రముఖులు.
23) వెంకీ : రవితేజ- స్నేహ
క్లైమాక్స్ లో హీరో .. విలన్ నుండి అతని మనుషుల నుండి తప్పించుకుని కోర్టుకు వెళ్ళడానికి హోలీ పండుగను ఉపయోగించుకుంటాడు.