బుల్లితెరపై ప్రసారమయ్యే అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం ఎన్నో అంచనాల నడుమ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఇక ఈ కార్యక్రమంలో కి 20 మంది కంటెస్టెంట్లు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి తమ ఆట తీరుతో ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే బిగ్ బాస్ కంటెస్టెంట్ల మధ్య గొడవలు కొట్లాటలు మొదలు పెట్టేసాడు అని చెప్పాలి. ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెంట్లు రెమ్యూనరేషన్ గురించి చర్చలు మొదలయ్యాయి.
ప్రతి సీజన్లోనూ బిగ్ బాస్ నిర్వాహకులు బాగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న స్టార్ సెలబ్రిటీలను ఈ కార్యక్రమంలోకి ఆహ్వానించేవారు.అయితే ఈసారి సీజన్లో మాత్రం సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కనిపించే వారిని ఒకటి రెండు సినిమాలలో నటించిన సెలబ్రిటీలను ఆహ్వానించారు. ఈ 20 మందిలో ఓ ఐదుగురు మినహా మిగిలిన సెలబ్రిటీలు మొహాలు కూడా ఇప్పటివరకు ప్రేక్షకులు చూడలేదని చెప్పాలి. సోషల్ మీడియాలో ఏ కొద్దో గొప్పో గుర్తింపు సంపాదించుకున్న కంటెస్టెంట్లు ఈ కార్యక్రమంలో పాల్గొని మరింత గుర్తింపు సంపాదించుకోవడం కోసం ఆరాటపడుతున్నారు.
ఇదే అదునుగా భావించిన బిగ్ బాస్ నిర్వాహకులు కంటెస్టెంట్లకు తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తూ వారి చేత ఎంటర్టైన్ చేయించడానికి సిద్ధమయ్యారు.ఈ క్రమంలోని ఈ సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్లలో అత్యంత తక్కువ రెమ్యూనరేషన్ ఎవరికి ఇచ్చారనే విషయం గురించి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియా కథనాల ప్రకారం అత్యంత తక్కువ రెమ్యూనరేషన్ ఆదిరెడ్డికి ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈయనని కామన్ మ్యాన్ ఎంట్రీ కింద బిగ్ బాస్ నిర్వాహకులు కంటెస్టెంట్ గా లోపలికి పంపించారు.
అయితే ఈయన బిగ్ బాస్ రివ్యూల ద్వారా భారీగానే సంపాదిస్తున్నారు. అయితే బిగ్ బాస్ రివ్యూ ఇచ్చే ఈయన బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొంటే ఎలా ఉంటుందన్న ఫ్యాషన్ తోనే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు తనకు ఎలాంటి రెమ్యూనరేషన్ వద్దని చెప్పినప్పటికీ నిర్వాహకులు మాత్రం ఈయనకు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ కార్యక్రమంలో అత్యంత తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ ఆదిరెడ్డి అని తెలుస్తుంది ఈయన వారానికి 1.75 లక్షల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారని సమాచారం.