బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ప్రారంభం అయ్యింది. మూడురోజులు అవుతున్నా ఇంకా నామినేషన్స్ లో ఎవరున్నారు అనేది ప్రేక్షకులకి సస్పెన్స్ గానే ఉంది. దీనికి కారణం హౌస్ మేట్స్ ఆడుతున్న టాస్క్. ట్రాష్ లో ఇంటి సభ్యులు ఒక్కొక్కరు వారి స్థానాలని మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం టాస్క్ లు ఆడుతున్నారు. ఛాలెంజస్ లో భాగంగా ఇప్పటికే క్లాస్ లో ఉన్న శ్రీహాన్ మాస్ లోకి, ట్రాష్ లో ఉన్న గీతు క్లాస్ లోకి వచ్చారు.
అలాగే, ట్రాష్ లోకి బాలాదిత్య, అభినయశ్రీ ఇద్దరూ వచ్చారు. ఫస్ట్ నుంచీ ట్రాష్ లో ఉన్న సుల్తానా గేమ్ పూర్తి అయ్యే సరికి కూడా ట్రాష్ లోనే ఉండిపోయింది. దీంతో ఈవారం నామినేషన్స్ అనేవి ఇంట్రస్టింగ్ గా మారాయి. ట్రాష్ లో ఉన్న ముగ్గురితో పాటుగా మాస్ లో ఉన్న మరికొంతమంది కూడా నామినేట్ అయినట్లుగా సమాచారం తెలుస్తోంది. ఫస్ట్ వారం మొత్తం 7గురు నామినేషన్స్ లోకి వచ్చారు. వీళ్లలో అభినయశ్రీ, ఇనయా సుల్తానా, రేవంత్, ఫైమా, ఆరోహిరావ్, శ్రీసత్య, చంటి ఉన్నట్లుగా సమాచారం.
ఎపిసోడ్ ఎండ్ అయ్యేసరికి బుధవారం నైట్ అవుతుంది కాబట్టి ఈ పార్టిసిపెంట్స్ కి ఓట్ వేసేందుకు కేవలం రెండు రోజులు మాత్రమే ఉంటుంది. గురువారం, శుక్రవారం వచ్చే ఓటింగ్ ని బట్టే ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆధారపడి ఉంటుంది. మరోవైపు బిగ్ బాస్ రివ్యూవర్స్ గా హౌస్ లోకి అడుగుపెట్టి ఆదిరెడ్డి, ఇంకా గీతురాయల్ ఇద్దరూ కూడా ఈవారం నామనేషన్స్ నుంచీ సేఫ్ అయ్యారు.
అంతేకాదు, ఇప్పుడున్న వాళ్లలో మరికొంతమంది నామినేట్ అయ్యారా లేదా వీళ్లతోనే ఈవారం నామినేషన్స్ ముగుస్తాయా అనేది ఆసక్తికరం. ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ లో వీకండ్ ఎలిమినేషన్స్ ఉంటాయా లేదా అనేది కూడా ఇప్పుడు ఇంట్రస్టింగ్ గా మారింది. మొత్తానికి మూడురోజులు సస్పెన్స్ తర్వాత ఏడుగురు నామినేషన్స్ లోకి రావడం గమనార్హం. మొత్తం 21మంది పార్టిసిపెంట్స్ లో ఈ ఏడుగురులో నుంచీ మొదటి వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.