ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ సలార్ యాక్షన్ మూవీగా తెరకెక్కినా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సలార్ సినిమాలో శ్రియారెడ్డి కీలక పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. పృథ్వీరాజ్ భార్య పాత్రలో ఆమె కనిపించనున్నారు. కథను మలుపు తిప్పే పాత్రలో ఆమె కనిపించనున్నారని సమాచారం అందుతోంది. సలార్ మూవీలో శ్రియారెడ్డి ఇచ్చే ట్విస్ట్ లు మామూలుగా ఉండవని ప్రభాస్ కు వదిన రోల్ లో ఆమె కనిపిస్తారని తెలుస్తోంది.
సలార్ మూవీ ప్రభాస్ స్థాయిని పెంచే మూవీ అవుతుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సలార్ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని క్రేజీ, షాకింగ్ అప్ డేట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. సలార్ సెకండ్ ట్రైలర్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది. సలార్2 మూవీ కోసం మరింత ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండనున్నాయని సమాచారం అందుతోంది.
సలార్1 మూవీలో ప్రభాస్ ఎంట్రీ ఆలస్యంగా ఉందనుందని తెలుస్తోంది. సలార్ లో ప్రభాస్, పృథ్విరాజ్ మధ్య వచ్చే సీన్లు సైతం నెక్స్ట్ లెవెల్ లో ఉండనున్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సలార్ సినిమా రికార్డ్ స్థాయి స్క్రీన్లలో రిలీజ్ కానుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. సలార్ సినిమా ఓవర్సీస్ లో 1979 ప్లస్ లొకేషన్స్ లో విడుదల కానుంది.
సలార్ (Salaar) మూవీకి ఇతర భాషల్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. బాలీవుడ్ లో సైతం ఈ సినిమా సంచలనాలు సృష్టించే అవకాశం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సలార్ రిలీజ్ తర్వాత ఏ రేంజ్ లో రికార్డులు సాధిస్తుందో చూడాల్సి ఉంది. ప్రభాస్ కోరుకున్న బాక్సాఫీస్ హిట్ ను ఈ సినిమా అందిస్తుందేమో చూడాలి.