ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, కమెడియన్‌గా, హీరోగా, హోస్ట్‌గా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని.. ఎప్పుడూ ఫుల్ బిజీగా జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తుంటారు కామెడీ కింగ్, ఎవర్ గ్రీన్ ఆలీ. దాదాపు వెయ్యికి పైగా చిత్రాలు చేశారాయన. హీరోగా పలు సూపర్ హిట్ ఫిలింస్ చేసిన అలీ ఇప్పుడు కొత్త జర్నీ స్టార్ట్ చేస్తున్నారు. యాక్టర్‌గా తిరుగులేని స్టార్ డమ్ సంపాదించుకున్న ఆలీ నిర్మాతగా మారి ఓ సినిమా చేస్తున్నారు.
ఆలీ ప్రధాన పాత్రలో నటిస్తూ.. ఆలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అనే బ్యానర్ స్థాపించారు.. డా. ఆలీ సమర్పణలో, కిరణ్ శ్రీపురం దర్శకత్వంలో, ఆలీ బాబా, కొణతాల మోహన్, శ్రీ చరణ్ కలిసి నిర్మించిన పక్కా కామెడీ మూవీ.. ‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి’.. మౌర్యానీ హీరోయిన్. ‘యమలీల’ లో ఆలీ తల్లిగా నటించిన పాపులర్ క్లాసికల్ డ్యాన్సర్, సీనియర్ నటి మంజు భార్గవి కీలకపాత్రలో నటిస్తున్నారు. వీకే నరేష్, పవిత్రా లోకేష్, భద్రం, ఎల్.బి.శ్రీరామ్, తనికెళ్ల భరణి తదితరులు నటించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
టీజర్ విడుదల చేసి, ఆలీ నిర్మాతగానూ సక్సెస్ కావాలంటూ సూపర్ స్టార్ కృష్ణతో పాటు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా అనిపించింది. అయితే ఆలీ తన సినిమాను థియేటర్లలో కాకుండా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. ఓటీటీ ద్వారా నేరుగా ప్రేక్షకుల ఇంటికే వెళ్లి వారిని ఎంటర్‌టైన్ చెయ్యొచ్చనే ఉద్దేశంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారట. తెలుగు పాపులర్ ఓటీటీ ఆహా ఈ ఫిలిం డిజిటల్ రైట్స్ తీసుకుంది.
అక్టోర్ 28న ఆహాలో ‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి’ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఏదైనా సినిమాలీ ఆలీ కాసేపు కనిపిస్తేనే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు.. అలాంటిది కొంత గ్యాప్ తర్వాత ఆయన ఫుల్ లెంగ్త్ రోల్ చేయడంతో ఎంటర్‌టైన్‌మెంట్ ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. రాకేష్, భాస్కర్ పట్ల ఈ సినిమాకి సంగీతమందించారు. ఓటీటీలో నేరుగా విడుదలవుతున్న ఆలీ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుందని తెలిపారు ఆహా టీం.