నాని హీరోగా వచ్చిన ‘ఆహా కళ్యాణం’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమయ్యింది బాలీవుడ్ భామ వాణీ కపూర్. ఈ చిత్రం ప్లాపవ్వడంతో ఈ అమ్మడికి ఇక్కడ అవకాశాలు రాలేదు. దీంతో మళ్ళీ బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ కూడా పెద్దగా అవకాశాలేమీ రాకపోయినా.. అడపా దడపా సినిమాల్లో నటిస్తూ కెరీర్ ను కొనసాగిస్తోంది. అప్పుడప్పుడు తన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా… తాజాగా ఈ అమ్మడు తనను రక్షించమంటూ పోలీసులను ఆశ్రయించడం చర్చనీయాంశం అయ్యింది.
అసలు విషయం ఏమిటంటే.. ముంబైలో రాత్రి సమయంలో వాణీకపూర్ తన కారులో వెళ్తుండగా.. ఓ గుర్తు తెలియని యువకుడు ఈమెను గమనించి ఫాలో అవ్వడం మొదలుపెట్టాడు. ఇది గమనించిన వాణీ కపూర్ కారు డ్రైవర్ మరింత వేగంగా కారు నడపడం మొదలు పెట్టాడు. అయినా సరే ఆ యువకుడు మాత్రం కారుని ఫాలో అవ్వడం ఆపలేదు. దీంతో వాణీ కపూర్ కారు డ్రైవర్ నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. వెంటనే వాణీకపూర్ ఆ యువకుడి పై కంప్లైంట్ ఇచ్చిందట. పోలీస్ ఎంక్వయిరీలో ఆ యువకుడి పేరు సమీర్ ఖాన్ అని సమాచారం అందింది.