‘క్రాక్’ చిత్రంలో చిన్న అతిథి పాత్ర పోషించాడు దర్శకుడు బి.వి.ఎస్.రవి. తర్వాత బాలయ్య హోస్ట్ చేసిన ‘అన్ స్టాపబుల్’ షోకి కూడా రైటర్ గా పనిచేశాడు. ఆ షో ఎంత సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే నాగ చైతన్య హీరోగా నటిస్తున్న ‘థాంక్యూ’ కి కూడా రైటర్ గా పనిచేశాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ త్వరలోనే విడుదల కాబోతుంది.హరీష్ శంకర్, కొరటాల శివ వంటి టాప్ డైరెక్టర్లు ఇతనికి మంచి ఫ్రెండ్స్.
గోపీచంద్ తో ‘వాంటెడ్’, సాయి ధరమ్ తేజ్ తో ‘జవాన్’ వంటి చిత్రాలు తెరకెక్కించాడు. కానీ ఆ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దాంతో ఇతనికి డైరెక్టర్ ఛాన్స్ లు కరువయ్యాయి. అయితే నందమూరికి బాలకృష్ణ బి.వి.ఎస్ రవికి దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చినట్టు సమాచారం. బాలయ్య కోసం బివిఎస్ రవి ఓ కథ సిద్ధం చేశాడట. అది బాలయ్యకి నచ్చింది. దాదాపు ఈ ప్రాజెక్టు సెట్ అయినట్టే అని వినికిడి.
`అన్ స్టాపబుల్`తో బాలయ్యకు కొత్త తరహా ఇమేజ్ రావడంలో బి.వి.ఎస్ రవి కృషి ఉంది. అందుకే రవికి బాలయ్య అవకాశం ఇచ్చినట్టు తెలుస్తుంది. బాలయ్య ఇలా ప్లాప్ దర్శకులకు ఛాన్స్ ఇవ్వడం కొత్తేమి కాదు.మంచితనం, మొహమాటం కొద్దీ ఈయన చాలా మంది దర్శకులకి ఛాన్స్ ఇచ్చి చేతులు కాల్చుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. మరి రవిని బాలయ్య ఎలా చూపిస్తాడో? ఈ ప్రాజెక్టుని ఏ నిర్మాత టేకప్ చేస్తాడో? చూడాలి.
ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఆ తరవాత.. అనిల్ రావిపూడితో సినిమా ఉంది. బోయపాటి శ్రీనుతో మరో సినిమా చేసే అవకాశం ఉంది. ఇవి చేస్తూనే రవితో కూడా సినిమా చేసే అవకాశం ఉంటుంది.